దసరా తర్వాత థియేటర్లలో కొత్త సినిమాల హడావిడి మొదలైంది.-Dasara

దసరా తర్వాత థియేటర్లలో కొత్త సినిమాల హడావిడి మొదలైంది.-Dasara buzz begins in theatres with new releases this week.

ఈ వారం థియేటర్లలో చిన్న సినిమాలు, ఓటీటీలో బ్లాక్ బస్టర్ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ విడుదల చేస్తున్న ‘శశివదనే’, వరుణ్ సందేశ్ హీరోగా ఉన్న ‘కానిస్టేబుల్’, అనసూయ నటించిన ‘అరి’ వంటి సినిమాలు అక్టోబర్ 10న బాక్సాఫీస్ వద్ద అదృష్టాన్ని పరీక్షించుకుంటాయి. మరోవైపు ఓటీటీలో ‘మిరాయ్’, ‘వార్ 2’, ‘త్రిబాణధారి బార్బరిక్’ వంటి సినిమాలు, వెబ్ సిరీస్‌లు ప్రేక్షకుల కోసం స్ట్రీమింగ్ కు సిద్ధంగా ఉన్నాయి.

శశివదనే
రక్షిత్ అట్లూరి, కోమలీ ప్రసాద్ హీరోహీరోయిన్లుగా నటించిన ప్రేమ కథ. సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వం వహించిన ఈ సినిమా గోదావరి బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది. ఫ్యామిలీ ఫ్రెండ్లీ గా రూపొందించిన చిత్రం అక్టోబర్ 10న విడుదల కానుంది.

కానిస్టేబుల్
వరుణ్ సందేశ్ హీరోగా నటించిన సస్పెన్స్-డ్రామా-కామెడీ మిక్స్ సినిమా. ఆర్యన్ సుభాన్ ఎస్.కె. దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మధులిక వారణాసి హీరోయిన్ గా నటించింది. అక్టోబర్ 10న థియేటర్లలో రిలీజ్ అవుతుంది.

అరి
అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, వినోద్ వర్మ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం. జయ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ‘మై నేమ్ ఈజ్ నోబడీ’ ట్యాగ్ లైన్ తో, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాల చుట్టూ అల్లుకున్న కథ. అక్టోబర్ 10న విడుదల.

మిరాయ్
తేజ సజ్జా, మంచు మనోజ్ హీరోలు నటించిన ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ మూవీ. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ సినిమా థియేటర్లలో మంచి ఆదరణ పొందింది. రూ.150 కోట్ల గ్రాస్ వసూలు సాధించి, అక్టోబర్ 10 నుంచి జియో హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో అందుబాటులో ఉంటుంది.
Post-Dasara buzz begins in theatres with new releases this week.

This week, small films are hitting theatres while blockbuster movies are ready to stream on OTT platforms. Films like Shashivadhane, Constable starring Varun Sandesh, and Ari featuring Anasuya will test their luck at the box office on October 10. At the same time, OTT platforms are ready to entertain audiences with movies like Mirai, War 2, Tribanadhari Barbarik, along with some interesting web series releases this week.

Shashivadhane
A romantic story starring Rakshit Atluri and Komali Prasad, directed by Sai Mohan Ubbana. Set against the backdrop of the Godavari river, the film is family-friendly and promises a thrilling climax. It is scheduled to release on October 10.

Constable
A suspense-drama-comedy mix starring Varun Sandesh and Madhulika Varanasi. Directed by Aryan Subhan S.K., the film has already attracted attention through promotional materials and will release in theatres on October 10.

Ari
Starring Anasuya Bharadwaj, Sai Kumar, and Vinod Verma, this film directed by Jai Shankar carries the tagline “My Name is Nobody”. It revolves around the six vices—lust, anger, greed, attachment, pride, and jealousy—and is set to release on October 10.

Mirai
A fantasy action-adventure film starring Teja Sajja and Manchu Manoj, directed by Karthik Ghattamneni. The movie was a hit at the box office, grossing ₹150 crore. It will start streaming on Jio Hotstar from October 10 and will be available in Telugu, Tamil, Kannada, and Malayalam.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *