జగిత్యాల : దళిత బంధు పథకం తమ ఆత్మబంధు వంటిదని చెప్పిన సీఎం కేసీఆర్ పథకం అమలులో అవినీతికి పాల్పడిన ఎమ్మెల్యేలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రశ్నించారు..శుక్రవారంజగిత్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక ఇంద్ర భవన్ లో శుక్రవారం పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆధారాలు లేకున్నా ఉప ముఖ్యమంత్రి పదవి నుండి తాటికొండ రాజయ్యను సీఎం కెసిఆర్ తొలగించారని,ఇప్పుడు దళిత బంధు పథకంలో ఒక్కొక్కరి నుండి రు.2 3 లక్షలు వసూలు చేస్తున్నారని, ఆధారాలు ఉన్నాయని స్వయంగా సీఎం కేసీఆర్ చెబుతున్నారని, అవినీతి పరులు, కమిషన్లకు కక్కుర్తి పడిన ప్రజాప్రతినిధుల పై ఎందుకు చర్యలు చేపట్టడం లేదని నిలదీశారు. దళిత బంధు నా ఆత్మ బందు అంటూ సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని నీరుగార్చుతున్నారని విమర్శించారు. నీకో నీతి..దళిత సమాజానికో నీతిన అని నిలదీశారు.తెలంగాణ ఉద్యమ సమయంలో అవినీతి కి ఎవరు పాల్పడినా సహించమన్న సీఎం కెసిఆర్ అవినీతిపరులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించాలనే నిబంధనకు అనుగుణంగా, ఎస్సీ సబ్ ప్లాన్ రూపొందించామని గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పాటు ఆనంతరం ఎస్సీ డెవలప్మెంట్ ఫండ్ గా పేరు మార్చి, కేటాయించిన నిధులు మరో సంవత్సరానికి క్యారీ ఫార్వర్డ్ చేసేలా నిబంధన ఏర్పాటు చేసి, నిధులు వెచ్చించకుండ దళితులను మభ్య పెడుతున్నారనీ ద్వజమెత్తారు. దళితుల సంక్షేమం కోసం బడ్జెట్ లో నిధులు కేటాయించి, వెచ్చించని నిధులు 30 వేల కోట్లతో పాటు 2022
23 లో ప్రతి నియోజక వర్గానికి 1500 మందికి దళిత బందు ఇచ్చేందుకు బడ్జెట్ లో 17,700 కోట్లు కేటాయించినా ఒక్కరి రూపాయి ఖర్చు చేయలేదన్నారు. దళిత బంధు ఇవ్వలేదని జీవన్ రెడ్డి ఆన్నారు. 2022`23 బడ్జెట్ లో నియోజక వర్గంలో 3000 చొప్పున స్వంత ఇళ్ల స్థలాల్లో ఇళ్లు నిర్మించుకునేందుకు రు.3 లక్షల చొప్పున ఇచ్చేందుకు 12,000 కోట్లు కేటాయించిన ఒక్క ఇల్లు కూడా కట్టలేదన్నారు. దళితులకు సంక్షేమం కోసం కేటాయించిన నిధులు సుమారు 50 వేల కోట్లతో 10 లక్షల చొప్పున 5 లక్షల ఇళ్లు నిర్మించవచ్చని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. దళితుల సంక్షేమం కోసం కేటాయించిన నిధులతో ఇళ్లు నిర్మిస్తే ఇళ్లు లేని నిరుపేదలుండరని అన్నారు. కళ్యాణ లక్ష్మి లబ్దిదారులందరికి ఇళ్లు నిర్మించి ఇవ్వాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. దళితుల సంక్షేమం కోసం కేటాయించిన నిధులు సైతం వెచ్చించకోతే ప్రయోజనం ఏముందని..ఎన్ని లక్షల బడ్జెట్ ప్రవేశ పెడితే ఎం లాభమని ఎమ్మెల్సీ అన్నారు. బడ్జెట్ లో కేటాయించిన నిధులు వెచ్చించించకుండ దళితులను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. అవినీతి పరులపై చర్యలు తీసుకోకపోతే సీఎం కెసిఆర్ బాధ్యత వహించాలన్నరు.నిరుద్యోగ ఖాళీలు భర్తీ చేస్తే వేతనాలు చెల్లించే స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం లేదని అన్నారు. అందుకే పేపర్ లీకేజీ కూడా నియామకంలో జాప్యం కోసం చేసిన కుట్ర లో భాగమేనని ఆరోపించారు. సీఎం కెసిఆర్ కు దళితుల సంక్షేమం పట్ల చిత్తశుద్ది ఉంటే ప్రకటనలకే పరిమితం కాకుండా, దళిత బంధు పథకంలో అవినీతికి పాల్పడిన ప్రజా ప్రతినిదులు ఏ స్థాయిలో ఉన్నా చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పీసీసీ సభ్యులు గిరి నాగభూషణం, పీసీసీ ఆర్గనైజింగ్ సెక్రెటరీ బండ శంకర్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ధర రమేష్ బాబు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కల్ల్ పెల్లి దుర్గయ్య,వర్తక సంఘం అధ్యక్షుడు కమాటల శ్రీనివాస్, పిసిసి ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ చాంద్ పాషా, రాధా కిషన్, బొల్లి శేఖర్, మహిపాల్, బీరం రాజేష్,నేహాల్ పాల్గొన్నారు.
RRRRRRRRRRRRRRRRRR