దళిత జనోద్ధారకుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో దళితులకు అభివృద్ధి ఫలాలు అందిస్తూ వారి అభ్యున్నతికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆహర్నిశలు పాటుపడుతున్నారని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ పేర్కొన్నారు. హైదరాబాద్ నడిబొడ్డున ట్యాంక్ బండ్ చెంతన 125 అడుగుల ఖాళీ అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేయడాన్ని పురస్కరించుకొని జియాగూడ మాజీ కార్పొరేటర్, సంఘసేవకులు, మిత్రా అసోసియేట్స్ చైర్మన్ మిత్రకృష్ణ నేతృత్వంలో వివిధ రంగాల్లో ప్రతిభకనబరుస్తున్న వారికి అంబేద్కర్ విద్యా వికాస్ మెరిట్ అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. జియాగూడ రోడ్లోని ఎస్.బి.ఎ గార్డెన్స్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్సీ ఎమ్. ఎస్. ప్రభాకర్, కార్వాన్ ఎమ్మెల్యే కౌసరెహియుద్దీన్, కార్పొరేటర్ స్వామియాదవ్, మాజీ కార్పొరేటర్లు బంగారి ప్రకాశ్, పరమేశ్వరీసింగ్, మిత్రకృష్ణ కలిసి ఉత్తమ విద్యార్థులు, క్రీడాకారులు, సంక్షేమ సంఘాల ప్రతినిధులకు, విద్యావేత్తలకు, ఐ. ఎ. ఎస్, ఐపీఎస్ తదితర సివిల్ సర్వీసులకు ఎంపికైన అభ్యర్థులకు అంబేద్కర్ విద్యా వికాస్ మెరిట్ అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం పుస్తకాన్ని మహమూద్ అలీ తదితరులు కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మహమూద్ అలీ ప్రసంగిస్తూ దళితులు అన్ని రంగాల్లో రాణిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని వృద్ధిలోకి రావాలని సూచించారు. దళితులను గొప్ప పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్ది వారిని అభివృద్ధిలోకి తీసుకురావాలనే సంకల్పంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కో దళిత కుటుంబానికి రూ.10లక్షల ఆర్థిక సహాయంతో కూడిన దళిత బంధు పథకాన్ని అమలుపరుస్తున్నారని, భారత రాష్ట్ర సమితి పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు పరుస్తామని సీఎం ప్రకటించారని గుర్తుచేశారు. భారాస, ఎం.ఐ.ఎం పార్టీలు పరస్పర స్నేహపూర్వక వాతావరణంలో కలిసి పనిచేయడం వల్లే ఈ నేడు హైదరాబాద్ నగరంలో మతఘర్షణలు రూపుమాసిపోయాయని వివరించారు ఎమ్మెల్సీ ఎమ్. ఎస్. ప్రభాకర్ రాన మాట్లాడుతూ ప్రపంచంలో ఏ దళిత ముఖ్యమంత్రి కూడా చేయలేని విధంగా `నగరంలో 125 అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించి సీఎం కేసీఆర్ దళితుల ఆత్మగౌరవాన్ని మరింత ఇనుమడిరపజేశారని అభివర్ణించారు. అంబేద్కర్ రచించిన లిఖిత పూర్వక రాజ్యాంగం నేడు ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ మాట్లాడుతూ దేశంలో ఏ ఒక్క దళితుడికి అన్యాయం జరిగినా జటు పార్లమెంటులోనే కాకుండా, దేశంలో ఎక్కడైనా దళితుల పక్షాన, ఓబీసీల పక్షాన గళం వినిపిస్తూ వారి సమస్యల పరిష్కారానికి ఎం. ఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఎనలేని కృషి చేస్తున్నారని వివరించారు. దేశంలో రోజురోజుకూ మారిపోతున్న పరిస్థితుల నేపథ్యంలో దళితులకు, ఓబీసీలకు మజ్లిస్ పార్టీ ఎల్లవేళలా అండగా నిలుస్తుందన్నారు. మిత్రకృష్ణ మాట్లాడుతూ సీఎం. కేసీఆర్ స్ఫూర్తితో అంబేద్కర్ ఆశయాలు, ఆయన భావజాలాన్ని అన్ని వర్గాల ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న సంకల్పంతోనే ప్రతీయేట అన్ని వర్గాలలో సేవలందిస్తున్న వారికి అంబేద్కర్ పేరిట అవార్డులు అందజేస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో సంఘ సంస్కర్త జె.బి.రాజు, కార్వాన్ ఎం ఎం కార్పొరేటర్ స్వామియాదవ్, మాజీ కార్పొరేటర్ పరమేశ్వరీసింగ్, భారాస పార్టీ రాష్ట్ర నాయకుడు కావూరి వెంకటేశ్, నేతలు అభిషేక్ మిత్రా, టి.నర్సింగరావు, నర్మద, సి బాబు తదితరులు పాల్గొన్నారు..
RRRRRRRRRRRRRRRRRRRRRRRRR