తెలంగాణలో ఇవాళ, రేపు భారీ వర్షాల సూచన. ఈదురుగాలులు, ఉరుములు – ప్రజలు అప్రమత్తంగా ఉండాలి….

Heavy rains and thunderstorms expected across Telangana.

తెలంగాణలో పలు జిల్లాల్లో ఇవాళ, రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. The Meteorological Department has issued a rain alert for Telangana, forecasting moderate to heavy rains in several districts over the next two days.

కర్ణాటక, తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు ఏర్పడిన ద్రోణి ప్రభావంతో సోమవారం తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. హైదరాబాద్ నగరంతో పాటు సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్, నిజామాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, మహబూబ్ నగర్, యాదాద్రి భువనగిరి, మేడ్చల్ మల్కాజిగిరి, నారాయణపేట, వికారాబాద్ జిల్లాల్లో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షాలు నమోదయ్యాయి.

Due to a trough extending from Karnataka and Tamil Nadu to the Comorin region, several parts of Telangana received rainfall on Monday, including Hyderabad and multiple districts.

వాతావరణ శాఖ ప్రకారం మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో పాటు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని అధికారులు తెలిపారు.

The department has forecast moderate to heavy rains on Tuesday and Wednesday, accompanied by thunderstorms, lightning, and gusty winds reaching speeds of 40–50 kmph.

అదిలాబాద్, కొమరంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా. కొన్ని ప్రాంతాల్లో వడగండ్ల వానలు కూడా కురిసే అవకాశముందని పేర్కొన్నారు.

Rain is likely in districts including Adilabad, Kumurambheem Asifabad, Mancherial, Nirmal, Nizamabad, Peddapalli, Jayashankar Bhupalpally, Mulugu, Bhadradri Kothagudem, Rangareddy, Hyderabad, Medchal-Malkajgiri, Vikarabad, Sangareddy, Medak, and Kamareddy, with chances of hailstorms in isolated areas.

రెండు రోజులపాటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వడగండ్ల వానలు, ఈదురుగాలుల వల్ల పంటలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉన్నందున రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

In the Greater Hyderabad region, light to moderate showers with occasional heavy spells are expected over the next two days. Farmers have been advised to take precautions to protect crops from potential damage due to hailstorms and strong winds.

ప్రజలు వర్షాల సమయంలో అప్రమత్తంగా ఉండాలని, అవసరం లేని ప్రయాణాలను తగ్గించాలని, మెరుపుల సమయంలో చెట్ల కింద నిలవకూడదని వాతావరణ శాఖ సూచించింది.

Authorities have advised the public to remain alert, avoid unnecessary travel during rains, and stay away from trees during lightning.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *