హైదరాబాద్: విద్యార్థుల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు ప్రభుత్వ స్కూళ్లలో బ్రేక్ ఫాస్ట్ ఏర్పాటుచేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఉ. 10-11 గంటల మధ్య విద్యార్థులకు బెల్లం, రాగి జావతో చేసిన పదార్థాలను అందించనుంది. అలాగే మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా వారంలో ఓ రోజు వెజిటబుల్ బిర్యానీతోపాటు తృణధాన్యాలతో చేసిన ఆహారాన్ని అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. త్వరలోనే విధివిధానాలు ఖరారు కానున్నాయి.