త్వరలో రాష్ట్రంలో బీజేపీ ఖాళీ… ఢిల్లీలో.. ప్రధాని కుర్చీ ఖాళీ.. 2024లో.. వైఫల్యాల మోదీకి గుజరాత్ ఘర్ వాపసీ తప్పదని మంత్రి కేటీఆర్ అమిత్ షా కు కౌంటర్ ఇచ్చారు. మరోసారి మోదీని ప్రధాని పీఠం ఎక్కిస్తే.. దేశాన్ని బలిపీఠం ఎక్కించినట్టే అనే బలమైన భావనలో ప్రజలు ఉన్నారన్నారు. కారు స్టీరింగ్ కాదు… బీజేపీ స్టీరింగే ఆదానీ చేతికి చిక్కిందిన్నారు. కార్పొరేట్ దోస్తు కబంధ హస్తాల్లో కమలం విలవిలలాడుతోందన్నారు. హిండెన్ బర్గ్ రిపోర్ట్ తో బీజేపీ ఫుల్ పిక్చర్ ను దేశప్రజలు 70 ఎంఎంలో చూసేశారని ఎద్దేవా చేసారు. ఇంకా ఏ ట్రయిలర్ అవసరం లేదన్నారు. తెలంగాణలో గల్లీ బీజేపీ నేతల పగటి వేషాలు నడవవని, ఢిల్లీ పెద్దల పగటి కలలు నెరవేరవుని, అదానీ విషయంలో జెపిసి కాదు కదా కనీసం సిట్ కూడా వేయని మోడీ సర్కార్, అవినీతి గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు. గుజరాత్ లో మోడీ హయాం లో మీరు హోం మంత్రి గా ఉన్నప్పుడు పేపర్ లీకుల లో గుజరాత్ No – 1 గా ఉన్నమాట నిజం కాదా అంటూ ఘాటుగా కేటీఆర్ ప్రశ్నిచారు. ముక్కునేలకు రాసినా… మోకాళ్ల యాత్ర చేసినా… మోసాల మోదీని తెలంగాణ నమ్మదున్నారు. బట్టేబాజ్ బీజేపీని తెలంగాణ సమాజం క్షమించదున్నారు.