న్యూ డిల్లీ/హైదరాబాద్ : ఢల్లీలో బీఆర్‌ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ అట్టహాసంగా ప్రారంభించారు. అనుకున్న ముహూర్తానికే అంటే సరిగ్గా మధ్యాహ్నం 1:05 గంటలకు కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. హోంమంత్రి మహమూద్ అలీ కి కూడా ఈ కార్యక్రమానికి హాజరుకావాలని పార్టీ ఆదేశాల ప్రకారం ఢల్లీ వెళ్లారు. హైదరాబాద్ నుంచి విమానంలో ఢల్లీ వెళ్లిన హోంమత్రి ఎయిర్ పోర్టు నుంచి కారులో పార్టీ ఆఫీసుకు బయలుదేరారు. అయితే మహమూద్ అలీకి ఢల్లీ పోలీసులు షాకిచ్చారు. అంతేకాదు ఆయన కారును అడ్డుకుని నడుచుకుంటూ వెళ్లాలని చెప్పారు. పాపం ఢల్లీ పోలీసులకు మహమూద్ అలీ.. తెలంగాణ రాష్ట్రానికి హోం మంత్రి అనే విషయం తెలియదు. సాదారణ పౌరుడు అనుకుని ఆయనపై పోలీసులు జులుం ప్రదర్శించారు. ఇదంతా అవగాహనలేక పోవడం వల్ల జరిగిన పొరపాటు. ఇంతలోనే తాను హోంమంత్రిని అని చెప్పడంతో పోలీసులు కంగుతున్నారు. పొరపాటును సరిదిద్దుకుని ఆయనను అనుమతించారు.