తెలంగాణ మున్సిపల్ ఎన్నికల విజయం పై ప్రియాంక గాంధీ అభినందనలు

Priyanka Gandhi



తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన నేపథ్యంలో, లోక్‌సభ సభ్యురాలు మరియు ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఢిల్లీలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని అభినందించారు.

Priyanka Gandhi ఢిల్లీలో A. Revanth Reddyతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై చర్చించారు.

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యంతో విజయం సాధించడంపై ప్రియాంక గాంధీ సంతోషం వ్యక్తం చేశారు. ప్రజల మద్దతు పార్టీకి బలమైన ఆధారంగా నిలిచిందని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాల పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేసినందునే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని తెలిపారు. ప్రజా సంక్షేమం, పారదర్శక పరిపాలన, అభివృద్ధి ప్రాధాన్యతలే ఎన్నికల ఫలితాల్లో ప్రతిఫలించాయని పేర్కొన్నారు.

ఈ భేటీ రాష్ట్ర రాజకీయ పరిణామాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.
After the Congress party’s decisive victory in the Telangana municipal elections, Lok Sabha MP and AICC General Secretary Priyanka Gandhi congratulated Chief Minister A. Revanth Reddy during a meeting in New Delhi.

Priyanka Gandhi met A. Revanth Reddy in New Delhi, where they discussed the recent municipal election results in Telangana.

Priyanka Gandhi expressed happiness over the Congress party’s strong performance, stating that the results reflect public support for the party in the state.

Chief Minister Revanth Reddy said the victory was a result of people’s satisfaction with the welfare and development initiatives implemented by the state government. He emphasized that transparent governance and a focus on public welfare played a key role in securing the mandate.

The meeting is being viewed as a significant political development following the municipal poll results in Telangana.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *