బాలికల ఉత్తీర్ణత శాతం 88.53..బాలుర ఉత్తీర్ణత శాతం 84.68
ఒక్క విద్యార్థి కూడా పాస్ కాని పాఠశాలలు 25
99 శాతం ఉత్తీర్ణతతో అగ్రస్థానంలో నిర్మల్ జిల్లా
59.46 శాతం ఉత్తీర్ణతతో చివరిస్థానంలో వికారాబాద్ జిల్లా
హైదరాబాద్ : తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు బషీర్బాగ్లోని ఎస్?సీఈఆర్?టీ కార్యాలయంలో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పదో తరగతి ఫలితాలను విడుదుల చేశారు. గత నెల 3 నుంచి 13 వరకు జరిగిన పరీక్షలకు 2 లక్షల 49 వేల 747 బాలురు.. 2 లక్షల 44 వేల 873 మంది బాలికలు కలిపి మొత్తం 4 లక్షల 94 వేల 620 మంది విద్యార్థులు హాజరయ్యారు. పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు 4.91 లక్షలు. పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులు 4.19 లక్షలు. 2,793 పాఠశాలల్లో వందశాతం ఉత్తీర్ణత. ప్రైవేటుగా పరీక్షలు రాసిన విద్యార్థులు 7,492. ప్రైవేటుగా రాసిన వారిలో 44.51 శాతం ఉత్తీర్ణతజూన్ 14 నుంచి 22 వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలుఅడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫీజు చెల్లింపు గడువు ఈ నెల 26