తెలంగాణ నుండి ప్రాతినిధ్యం వహిస్తూ ‘మిసెస్‌ ఇండియా గ్లోబల్‌‘ ఫైనల్స్‌ కు చేరుకున్నసినీతార అంకిత ఠాకూర్‌ ఓటింగ్‌ ద్వారా తెలుగు ప్రజలంతా సపోర్ట్‌ చేయాలని విజ్ఞప్తి

పెగాసిస్‌ వారు నిర్వహిస్తోన్న ‘మిసెస్‌ ఇండియా గ్లోబల్‌ ‘ ఫైనల్స్‌ కు సెలక్ట్‌ అయ్యారు సినీనటి అంకిత ఠాకూర్‌. ఈ నెల 11న కేరళలోని కొచ్చిలో ఫైనల్స్‌ జరగనున్నాయి. ఈ సందర్భంగా తెలంగాణ నుంచి ‘మిసెస్‌ ఇండియా గ్లోబల్‌ కు సెలక్ట్‌ అయిన అంకిత ఠాకూర్‌ ఈ రోజు ఫిలించాంబర్‌ లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ‘మిస్‌ ఏసియా‘ రష్మి ఠాకూర్‌, తెలంగాణ ఫిలించాంబర్‌ ఛైర్మన్‌ డా.ప్రతాని రామకృష్ణ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అంకిత ఠాకూర్‌ మాట్లాడుతూ…‘‘తెలంగాణ కు ప్రాతినిధ్యం వహిస్తూ ‘మిసెస్‌ ఇండియా గ్లోబల్‌ ఫైనల్స్‌ కు చేరుకోవడం చాలా సంతోషంగా ఉంది. తెలంగాణ ప్రజలంతా ఓటింగ్‌ ద్వారా నాకు సపోర్ట్‌ చేస్తారని కోరుకుంటున్నా. కొచ్చీలో ఈ నెల 11న ‘మిసెస్‌ ఇండియా గ్లోబల్‌‘ ఫైనల్స్‌ జరగనున్నాయి‘ అన్నారు.
‘మిస్‌ ఏసియా‘, తెలంగాణ మా అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ రష్మీ ఠాకూర్‌ మాట్లాడుతూ…‘‘పెగాసిస్‌ వారు కండక్ట్‌ చేస్తోన్న ‘మిసెస్‌ ఇండియా గ్లోబల్‌ ‘ ఫైనల్స్‌ కు చేరుకున్న అంకిత ఠాకూర్‌ నాకు కజిన్‌ అవుతారు. గత కొంత కాలంగా తనకు నేను ట్రైనీగా ఉన్నాను. కచ్చితంగా తను ‘మిస్‌ ఇండియా గ్లోబల్‌‘ క్రౌన్‌ గెలుచుకుని వస్తుందన్న నమ్మకం ఉంది. మన తెలంగాణను రిప్రజెంట్‌ చేస్తోన్న అంకిత ఠాకూర్‌ కి ఓటింగ్‌ ద్వారా తెలంగాణతో పాటు తెలుగు ప్రజలంతా సపోర్ట్‌ చేయాలని కోరుకుంటున్నా‘‘ అన్నారు.
తెలంగాణ ఫిలించాంబర్‌ చైర్మన్‌ డా.ప్రతాని రామకృష్ణగౌడ్‌ మాట్లాడుతూ…‘‘తెలంగాణ నుంచి ‘మిసెస్‌ ఇండియా గ్లోబల్‌ ‘ఫైనల్స్‌ కు చేరుకున్న అంకిత ఠాకూర్‌ కి ముందుగా శుభాకాంక్షలు. ఈ నెల 11న కొచ్చిలో ఫైనల్స్‌ జరుగనున్నాయి. కచ్చితంగా అంకిత ఠాకూర్‌ ‘మిసెస్‌ ఇండియా గ్లోబల్‌ ‘ గెలుచుకుని వస్తుందన్న నమ్మకం ఉంది. తెలంగాణ ప్రజలతో పాటు, తెలుగు వారందరూ కూడా ఆమెకు ఓట్లు వేసి మద్దతు తెలపాలని కోరుకుంటున్నా. గతంలో మిస్‌ ఏసియా టైటిల్‌ గెలుచుకున్న రష్మీ ఠాకూర్‌ కి కూడా మా తెలంగాణ ఫిలించాబర్‌ ఎంతో సపోర్ట్‌ చేసింది. ఇప్పుడు అంకిత ఠాకూర్‌ కి కూడా మా ఫుల్‌ సపోర్ట్‌ ఉంటుంది. ప్రజంట్‌ రష్మీ ఠాకూర్‌, అంకిత ఠాకూర్‌ లు హీరోయిన్లుగా రెండు చిత్రాలు నిర్మిస్తున్నా‘‘ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *