హైదరాబాద్ : తెలంగాణ ఎంసెట్ ఫలితాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఇంజినీరింగ్‌లో 80 శాతం ఉత్తీర్ణత, అగ్రికల్చర్, ఫార్మాలో 86 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. తెలంగాణ ఎంసెట్‌లో సైతం బాలికలదే పై చేయి. ఇంజినీరింగ్‌లో 79 శాతం మంది అబ్బాయిలు, 85 శాతం మంది అమ్మయిలు క్వాలిఫై అయ్యారు. ఇంజినీరింగ్‌లో అనిరుధ్ అనే విద్యార్థికి మొదటి ర్యాంకు లభించింది. వెంకట మణిందర్ రెడ్డికి సెకండ్ ర్యాంకు లభించింది.కాగా ఈ నెల 10, 11 తేదీల్లో ఎం సెట్ అగ్రికల్చర్ అండ్ మెడికల్ స్ట్రీమ్ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. 12 నుంచి 15 వరకు ఆరు విడుతల్లో ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు జరిగాయి. ఇంజినీరింగ్ పరీక్షకు లక్షా 95 వేల 275 మంది విద్యార్థులు హాజరయ్యారు. అగ్రికల్చర్ పరీక్షను లక్షా 6 వేల మంది విద్యార్థులు రాశారు. ఇటీవల ప్రాథమిక కీ, రెస్పాన్స్ షీట్లను విడుదల చేసి అభ్యంతరాలను అధికారులు స్వీకరించారు.కాగా..ఎంసెట్పలితాల కోసం లిలిలి.నిబినివలిబ.ఞనీఎ, వజీఎఞవబి.బిబఞష్ట్రవ.జీఞ.తిని అనే వెబ్‌సైట్‌ను లాగిన్ అవొచ్చు.తెలంగాణలో 96.35%, ఆంధ్రప్రదేశ్‌లో 92.50% హాజరు నమోదైంది. హైదరాబాద్‌లో అత్యధికంగా 97శాతం మంది విద్యార్థులు ఎంసెట్ పరీక్ష రాశారు. ఈ నెల 10, 11 తేదీల్లో అగ్రికల్చర్.. 12, 13, 14 తేదీల్లో ఇంజనీరింగ్ విభాగం పరీక్షలను నిర్వహించారు. అగ్రికల్చర్ ప్రిలిమినరీ కీ ని అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఈ కీపై అభ్యంతరాలకు అవకాశం కల్పించారు. అలాగే ఇంజనీరింగ్ ప్రిలిమినరీ కీని ఎంసెట్ కన్వీనర్ ప్రకటించారు. ఈ ఏడాది ఎంసెట్‌కు 3,20,683 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 3,01,789 మంది పరీక్ష రాశారు. 94.11% మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.