Telangana to Launch 100 Public Schools; AI Education & Breakfast Scheme from 2026

తెలంగాణలో హైదరాబాదు వెలుపల 100 నియోజకవర్గాల్లో తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు; నాణ్యమైన విద్య, ఆధునిక వసతులు, బ్రేక్‌ఫాస్ట్ పథకం, ఏఐ బోధనపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. Telangana Chief Minister Revanth Reddy has directed the launch of 100 Telangana Public Schools outside Hyderabad, announcing key decisions on quality education, modern infrastructure, breakfast scheme, and AI-based learning.
Revanth Reddy కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో విద్యాశాఖపై సమీక్ష నిర్వహించి, రాష్ట్రవ్యాప్తంగా (హైదరాబాదు నగరం వెలుపల) 100 నియోజకవర్గాల్లో ఈ ఏడాది నుంచే తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు ప్రారంభించాలని ఆదేశించారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్లలో ఉన్న మోడల్ స్కూల్ తరహాలోనే తరగతి గదులు, క్రీడా మైదానం, రవాణా సౌకర్యం, బోధనా సిబ్బంది వంటి అన్ని వసతులు కలిగి ఉండాలని స్పష్టం చేశారు.
కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (CURE) పరిధిలో కార్పొరేట్ పాఠశాలల తరహాలో ప్రభుత్వ పాఠశాలలను నిర్మించాలని, ఏడాదిలో 12 ఇంటిగ్రేటెడ్ నూతన పాఠశాలల నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. హైదరాబాద్‌లోని Bharatiya Vidya Bhavan, Jubilee Hills Public School లలో ఉన్న సదుపాయాల మాదిరిగానే ఈ పాఠశాలల్లో వసతులు ఉండాలని సూచించారు. క్యూర్ పరిధిలో అప్‌గ్రేడ్ చేయనున్న 17 పాఠశాలలు, అదనపు గదులు కల్పించనున్న 164 పాఠశాలల పనుల్లో ఎటువంటి రాజీ ఉండకూడదని పేర్కొన్నారు.
కృత్రిమ మేధ (AI) ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న నేపథ్యంలో పాఠశాల స్థాయి నుంచే ఏఐ బోధన ప్రారంభించాలని ఆదేశించారు. ఉపాధ్యాయులు, లెక్చరర్లకు స్వల్పకాలిక శిక్షణ తరగతులు నిర్వహించాలని సూచించారు. పాలిటెక్నిక్ కళాశాలలు, ఏటీసీల్లో ఏఐ ఆధారిత కోర్సులు ప్రారంభించి, పాత కోర్సులను తొలగించాలని తెలిపారు. కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
2026–27 విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్‌ఫాస్ట్ అమలు చేయాలని నిర్ణయించారు. ప్రతి విద్యార్థికి బ్రేక్‌ఫాస్ట్‌తో పాటు పాలు అందించాలని, వాటిని Vijaya Dairy నుంచి సేకరించాలని సూచించారు. విద్యార్థులకు అందుతున్న క్యాలరీలపై సాంకేతిక పద్ధతులతో పర్యవేక్షణ చేయాలని తెలిపారు. ఈ ఏడాది నుంచే స్కూల్ కిట్‌లో బ్యాగ్, పెన్నులు, పెన్సిళ్లు, జామెట్రీ బాక్స్, డిక్షనరీ, బూట్లు, సాక్సులు ఇవ్వాలని, అవసరమైన నిధులు బడ్జెట్‌లో పొందుపరచాలని ఆదేశించారు.
రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలకు నిధులు కేటాయిస్తామని తెలిపారు. ఇప్పటికే Osmania University కు రూ.1000 కోట్లు కేటాయించిన నేపథ్యంలో, ఇతర విశ్వవిద్యాలయాలకు అవసరమైన నిధులపై నివేదిక సమర్పించాలని ఆదేశించారు.
ప్రైవేట్ పాఠశాలల ఫీజు నియంత్రణపై జిల్లా స్థాయిలో కలెక్టర్, డీఈవోల నేతృత్వంలో పాఠశాలల పరిశీలన చేసి నివేదిక ఇవ్వాలని సూచించారు. రాష్ట్ర స్థాయిలో రిటైర్డ్ జడ్జి లేదా రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ స్థాయిలో తుది కమిటీ ఏర్పాటు చేసి నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. తల్లిదండ్రులు, మేధావులు, సామాజికవేత్తల అభిప్రాయ సేకరణ కోసం ముసాయిదాను పబ్లిక్ డొమైన్‌లో ఉంచాలని ఆదేశించారు.
The Chief Minister emphasized transforming government schools into centers of excellence with corporate-level facilities. He directed completion of integrated schools within a year under the CURE framework and stressed the introduction of AI education from school level.
From the 2026–27 academic year, a breakfast scheme will be implemented in all government schools, along with milk supply through Vijaya Dairy. School kits including bags, stationery, shoes, and other essentials will be provided to students.
Funds will be allocated to all state universities, following the ₹1,000 crore allocation to Osmania University. Measures for regulating private school fees will be finalized after district-level inspections and review by a state-level committee.