
తెలంగాణలో వర్షాల జోరు | Telangana Rains Intensify – Yellow Alert Issued for Several Districts
రుతుపవన ద్రోణి ప్రభావంతో తెలంగాణలో వర్షాలు పెరిగాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేడు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు.
Due to the active monsoon trough, several districts in Telangana are experiencing moderate to heavy rains, according to the India Meteorological Department (IMD). Yellow alerts have been issued for multiple regions where intense rainfall is likely today.
హైదరాబాద్ వాతావరణ కేంద్రం విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం, ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని ఆదిలాబాద్, నిజామాబాద్, భూపాలపల్లి, ఖమ్మం, మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి.
IMD’s bulletin predicts heavy rainfall in districts like Adilabad, Nizamabad, Bhupalapally, Khammam, and Medak. Light to moderate showers are expected in other parts of the state.
రేపు కూడా రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. నైరుతి రుతుపవనాలు బలపడటంతో వచ్చే 48 గంటల్లో వర్షాల తీవ్రత పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Rainfall is expected to continue tomorrow (July 4) as well, with intensifying southwest monsoon activity. Citizens in low-lying areas have been advised to stay alert, as waterlogging and traffic disruptions may occur.
ఈ వర్షాలతో పంటలకు ఎంతో మేలు జరిగే అవకాశం ఉన్నప్పటికీ, నగరాల్లో నీరు నిలిచిపోవడం, ప్రయాణ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణ శాఖ వర్షాలపై అప్డేట్స్ జారీ చేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తోంది.
While rains may benefit agriculture, urban flooding and travel disruption are concerns. IMD continues to monitor conditions and is issuing alerts across the state.