
తెలంగాణలో రాబోయే నాలుగు రోజులు వర్షాలు ముమ్మరం – భారీ నుంచి అతిభారీ వర్షాల హెచ్చరిక
Heavy to very heavy rains forecast for the next four days in Telangana
హైదరాబాద్ సెప్టెంబర్ 1:
తెలంగాణలో రాబోయే నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తూ వాతావరణశాఖ హెచ్చరికలు విడుదల చేసింది.
Meteorological officials explained that a cyclonic circulation over the northeast Bay of Bengal, extending up to 5.8 km above sea level and tilting southwestwards, may lead to a low-pressure system within 24 hours. Another cyclonic circulation over north Odisha coast and adjoining areas is also influencing the situation.
ఈ ప్రభావంతో సోమవారం భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, పెద్దపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్, హన్మకొండ, జగిత్యాల, కరీంనగర్, ఖమ్మం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, వరంగల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
On Tuesday, districts including Khammam, Hanmakonda, Nirmal, Nizamabad, Rajanna Sircilla, Jagtial, Karimnagar, Mulugu and others are expected to witness heavy to very heavy rainfall. Warnings continue for several districts on Wednesday too, including Bhadradri Kothagudem, Jayashankar Bhupalpally, Mulugu and Mahabubabad.
ఈ నెల 4న రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. ఇప్పటికే గడచిన 24 గంటల్లో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, కామారెడ్డి, పెద్దపల్లి, మంచిర్యాల, వరంగల్, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు రికార్డయ్యాయి. ములుగు జిల్లా ఏటూరునాగారంలో 11.7 సెం.మీ, కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో 15 సెం.మీ, కొత్తగూడెంలో 19.2 సెం.మీ, నాగుపల్లెలో 12 సెం.మీ, మహబూబాబాద్ జిల్లా భూపతిపేటలో 11.9 సెం.మీ వర్షపాతం నమోదయింది.