తెలంగాణలో భారీ స్థాయిలో ఐఏఎస్ అధికారుల బదిలీలు చేపట్టిన ప్రభుత్వం మొత్తం 45 మందిని వివిధ కీలక పదవులకు మార్చుతూ ఉత్తర్వులు జారీ చేసింది.

The Telangana government has ordered a major reshuffle of IAS officers, transferring 45 officials to key administrative positions across the state.

తెలంగాణలో భారీ స్థాయిలో ఐఏఎస్ అధికారుల బదిలీలు చేపట్టిన ప్రభుత్వం మొత్తం 45 మందిని వివిధ కీలక పదవులకు మార్చుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
The Telangana government has ordered a major reshuffle of IAS officers, transferring 45 officials to key administrative positions across the state.

హైదరాబాద్: రాష్ట్రంలో పరిపాలనా పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఐఏఎస్ అధికారుల విస్తృత బదిలీలు చోటుచేసుకున్నాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. పలు జిల్లాలకు కొత్త కలెక్టర్ల నియామకం జరగడంతో పాటు కీలక శాఖల్లోనూ మార్పులు చేపట్టారు.

సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) ముఖ్యకార్యదర్శిగా రాహుల్ బొజ్జా నియమితులయ్యారు. బీసీ సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సంజయ్ కుమార్, విపత్తు నిర్వహణ మరియు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా దాన కిషోర్ నియమితులయ్యారు. ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ విభాగం కార్యదర్శిగా గౌరవ్ ఉప్పల్ బాధ్యతలు స్వీకరించనున్నారు.

దేవాదాయశాఖ డైరెక్టర్‌గా ఎం. హనుమంతరావును నియమించి, గోదావరి పుష్కరాల ప్రత్యేక అధికారిగా అదనపు బాధ్యతలు ఇచ్చారు. ప్రజావాణి రాష్ట్ర నోడల్ అధికారిగా డి. దివ్య నియమితులయ్యారు.

జిల్లా స్థాయిలోనూ కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. జనగాం కలెక్టర్‌గా సందీప్ కుమార్ ఝా, యాదాద్రి భువనగిరి కలెక్టర్‌గా అనురాగ్ జయంతి, జోగులాంబ గద్వాల్ కలెక్టర్‌గా రిజ్వాన్ బాషా షేక్, నారాయణపేట్ కలెక్టర్‌గా ప్రతీక్ జైన్, మహబూబాబాద్ కలెక్టర్‌గా స్నేహ శబరీష్, కరీంనగర్ కలెక్టర్‌గా చైత్ర మిశ్రా, రాజన్న సిరిసిల్ల కలెక్టర్‌గా గరీమా అగర్వాల్, వికారాబాద్ కలెక్టర్‌గా దీపక్ తివారి, మెదక్ కలెక్టర్‌గా ప్రతిమా సింగ్, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌గా అంకిత్, మహబూబ్‌నగర్ కలెక్టర్‌గా కష్బూ గుప్తా, హనుమకొండ కలెక్టర్‌గా చాహత్ బాజ్‌పాయ్ నియమితులయ్యారు.

అదనపు కలెక్టర్లుగా ఫణీంద్రా రెడ్డి (నారాయణపేట్), ఫైజాన్ అహ్మద్ (మేడ్చల్ మల్కాజిగిరి), ఉమశంకర్ ప్రసాద్ (వికారాబాద్), శ్యామ్ ప్రసాద్ లాల్ (నాగర్‌కర్నూల్), పి. చంద్రయ్య (మంచిర్యాల), వైవీ గణేశ్ (వరంగల్), అబ్దుల్ హమీద్ (సిద్దిపేట), బి. వెంకటేశ్వర్లు (నిర్మల్), కీమ్యా నాయక్ (వనపర్తి) నియమితులయ్యారు.

ఇతర నియామకాల్లో బి. విజియేంద్ర తెలంగాణ సాంఘిక సంక్షేమ నివాస విద్యా సంస్థల సొసైటీ కార్యదర్శిగా, ఎస్సీ అభివృద్ధి కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. దివ్య దేవరాజన్ సెర్ప్ సీఈవోగా కొనసాగుతూనే ప్రజావాణి రాష్ట్ర నోడల్ అధికారిగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తారు. అద్వైత్ కుమార్ సింగ్ ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో సమన్వయ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా బదిలీ అయ్యారు. సిక్త పట్నాయక్ ఆర్థిక శాఖ స్పెషల్ సెక్రటరీగా నియమితులయ్యారు. పామెలా సత్పతి కార్మిక శాఖ స్పెషల్ కమిషనర్‌గా, రాహుల్ రాజ్ సహకార శాఖ స్పెషల్ కమిషనర్ మరియు సహకార సంఘాల రిజిస్ట్రార్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. భవేష్ మిశ్రా ఐటీ శాఖలో స్పెషల్ సెక్రటరీగా రీడిజిగ్నేట్ అయ్యారు.

ప్రభుత్వం పరిపాలన సమర్థతను పెంపొందించేందుకు ఈ మార్పులు చేపట్టినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
Hyderabad: In a major administrative reshuffle, the Telangana government has transferred 45 IAS officers across key departments and districts. Chief Secretary K. Ramakrishna Rao issued the orders on Thursday. Several districts have been assigned new Collectors, along with changes in important state departments.

Rahul Bojja has been appointed as Principal Secretary of the General Administration Department (GAD) and given additional charge of BC Welfare. Sanjay Kumar has been posted as Special Chief Secretary, Panchayat Raj, while Dana Kishore will serve as Special Chief Secretary for Disaster Management and Revenue. Gaurav Uppal has been appointed Secretary, Finance and Planning.

M. Hanumantha Rao has been appointed Director of Endowments and given additional responsibility as Special Officer for Godavari Pushkaralu. D. Divya has been appointed State Nodal Officer for Prajavani.

At the district level, several new Collectors have been appointed, including Sandeep Kumar Jha (Jangaon), Anurag Jayanti (Yadadri Bhuvanagiri), Rizwan Basha Shaik (Jogulamba Gadwal), Prateek Jain (Narayanpet), Sneha Shabarish (Mahabubabad), Chaitra Mishra (Karimnagar), Garima Agrawal (Rajanna Sircilla), Deepak Tiwari (Vikarabad), Pratima Singh (Medak), Ankit (Bhadradri Kothagudem), Khushboo Gupta (Mahabubnagar), and Chahat Bajpai (Hanumakonda).

The government stated that the reshuffle aims to enhance administrative efficiency and governance across the state.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *