The Telangana government has initiated a structured process to regulate private school fees, fixing base fees based on the last three years’ financial records and allowing only up to 8% hike once in two years from the next academic yea.

తెలంగాణలో ప్రైవేట్ పాఠశాలల ఫీజులపై నియంత్రణకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. గత మూడేళ్ల ఆదాయ-వ్యయాల లెక్కల ఆధారంగా బేస్ ఫీజు నిర్ణయించి, ప్రతి రెండేళ్లకు గరిష్టంగా 8% మాత్రమే పెంపు అనుమతించే విధానాన్ని వచ్చే విద్యా సంవత్సరం నుంచే అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. The Telangana government has initiated a structured process to regulate private school fees, fixing base fees based on the last three years’ financial records and allowing only up to 8% hike once in two years from the next academic year
ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా సుమారు 11 వేల ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు ఉన్నాయి. 2025-26 విద్యా సంవత్సరం ముగింపు దశకు చేరుకోగా, వచ్చే విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమయ్యే ముందు ఫీజుల నియంత్రణకు స్పష్టమైన మార్గదర్శకాలు తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ఇప్పటివరకు కొన్ని పాఠశాలల్లో ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచుతున్నట్లు తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. నర్సరీ, ఎల్కేజీ స్థాయిలోనే అధిక డొనేషన్లు, ఫీజులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం శాస్త్రీయ విధానంతో ఫీజులను నిర్ణయించే ప్రక్రియను వేగవంతం చేసింది.
ప్రతి రెండేళ్లకోసారి గరిష్టంగా 8 శాతం మాత్రమే ఫీజు పెంచుకునేలా సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి విధివిధానాలను ఖరారు చేయడానికి విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఎంఈవోలు, డీఈవోల ద్వారా ప్రతి పాఠశాలలో ప్రస్తుతం వసూలు చేస్తున్న ఫీజులు, ఏఏ తరగతులకు ఎంత తీసుకుంటున్నారు, గత మూడేళ్ల ఆదాయ-వ్యయాలు వంటి వివరాలను సేకరిస్తున్నారు.
పాఠశాల నిర్వహణ ఖర్చులు, టీచర్ల జీతాలు, ఇతర వ్యయాలు, ఆడిట్ నివేదికలను పరిగణనలోకి తీసుకుని ఒక బేస్ ఫీజు నిర్ణయించనున్నారు. అదే ఆధారంగా తర్వాతి రెండేళ్ల ఫీజు నిర్మాణాన్ని ఖరారు చేయనున్నారు. నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తే అనుమతి రద్దు చేయడంతో పాటు అదనంగా వసూలు చేసిన సొమ్మును తిరిగి చెల్లింపజేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసే అవకాశముంది.
ఇటీవల విద్యాశాఖపై సమీక్ష నిర్వహించిన Revanth Reddy, ఫీజుల నియంత్రణ కోసం రాష్ట్ర స్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కమిటీకి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి లేదా ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శిని చైర్మన్గా నియమించే అవకాశముంది. కమిటీ సిఫార్సులను ప్రజాభిప్రాయం కోసం అధికారిక వెబ్సైట్లో ఉంచాలని కూడా నిర్ణయించారు.
The government is collecting data on the existing fee structure in all private schools through MEOs and DEOs. Officials are examining three years’ audited reports, teacher salaries, infrastructure and maintenance costs to determine a rational base fee. Based on this, schools will be allowed to revise fees only once in two years, with a maximum cap of 8 percent.
A state-level Fee Regulation Committee is set to be constituted under the chairmanship of a retired High Court judge or a former Chief Secretary. The recommendations will be placed on the official website for public opinion. The government aims to implement the new fee control mechanism from the upcoming academic year to ensure transparency and protect parents from arbitrary hikes.