బద్వేలు : పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం, వేంపల్లి మేజర్ పంచాయతీ, బలిజ సంఘం వీధికి చెందిన పలువురు యువకులు సోమవారం కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బీగాల రామకృష్ణ నేతృత్వంలో కాంగ్రెస్ రాష్ట్ర విూడియా చైర్మన్ మరియు మాజీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి సమక్షంలో వైకాపా పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు. తిరుమల శెట్టి వేమయ్య, బాలం సుబ్బరాయుడు, మణికంఠ, నామా వెంకట వినయ్, ముద్దా లోకేష్, శ్యామ్, వినయ్, విజయ్ తదితర యువకులు, వారి కుటుంబీకులు, వారి మిత్రబృందం వైకాపా పార్టీ నుండి కాంగ్రెస్లో చేరారు. కాంగ్రెస్ పాలనలోనే రైతులు, రైతు కూలీలు, యువత, విద్యార్థులు, బలహీన వర్గాల వారు బాగుపడతారని రాష్ట్రం, దేశం బాగుపడాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని అందుకే కాంగ్రెస్లో చేరుతున్నామని వారు అన్నారు, కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం, గుర్తింపు,గౌరవం కల్పిస్తామని తులసి రెడ్డి అన్నారు, వైకాపా పార్టీ మునిగిపోయే నావ యని, ఎప్పుడు ఎన్నికలు పెట్టిన ఓటమి తప్పదని అందువల్ల తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రావాలని, స్వగృహ ప్రవేశం చేయాలని వైకాపా నాయకులకు, శ్రేణులకు తులసిరెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీకి అటు రాష్ట్రంలో ఇటు దేశంలో పూర్వవైభవం వస్తుందని కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అన్నిచోట్ల పునరావృతం అవుతాయని తులసి రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడం స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి ఆశయమని ఆయన ఆశయ సాధన కోసం కృషి చేద్దామని అన్నారు, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరు లక్షల వరకు వ్యవసాయ రుణాల మాఫీ, 500 కే వంట గ్యాస్ సిలిండర్ సరఫరా, నిరుపేద కుటుంబాలకు నెలకు 6000 ఆర్థిక సాయం, ప్రత్యేక హోదా అమలు, బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ అమలు,కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ నిర్మాణంతో సహా పెండిరగ్ లో ఉన్న అన్ని సమస్యలను పరిష్కరిస్తామని పై ఆరు సూత్రాల కార్యక్రమాన్ని అమలు చేస్తామన్నారు,. షర్మిలపై తులసిరెడ్డి వ్యాఖ్యలు. వైయస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరుతుందన్న వార్తలపై విూ స్పందన ఏమిటని విలేకరులు తులసి రెడ్డిని ప్రశ్నించారు వైయస్ షర్మిలమ్మ కాంగ్రెస్ పార్టీలో చేరదలుచుకుంటే హృదయపూర్వకంగా ఆహ్వానిస్తామని తులసి రెడ్డి అన్నారు. వైయస్ షర్మిలమ్మ స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి కుమార్తె, రాజశేఖర్ రెడ్డి అసలు సిసలు కాంగ్రెస్ వాది చివరి శ్వాస ఉన్నంతవరకు కాంగ్రెస్ వాదిగా ఉన్నారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే తన జీవితాశయం అని చెప్పేవారు రాజశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ తరపున ఆరుసార్లు ఎమ్మెల్యేగా, నాలుగు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు, రెండుసార్లు పిసిసి అధ్యక్షులుగా, ఒకసారి సీఎల్పీ లీడర్ గా, రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు. అటువంటి అసలైన కాంగ్రెస్ వాది అయిన స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైయస్ షర్మిలమ్మ కాంగ్రెస్ పార్టీలో చేరదలుచుకుంటే స్వాగతిస్తామని తులసి రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పులివెందుల అసెంబ్లీ ఇన్చార్జ్ వేలూరు శ్రీనివాసులు రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ సుబ్రహ్మణ్యం, జిల్లా ప్రధాన కార్యదర్శి చెన్నకేశవ, పులివెందుల పట్టణ అధ్యక్షులు శ్రీకాంత్, వేముల మండల అధ్యక్షులు మహేంద్ర, ఉత్తన్న అమర్నాథ్ రెడ్డి, బద్రి, రాఘవయ్య, శివయ్య,రవి, నాగార్జున, తరుణ్ కుమార్ రెడ్డి, నాని, అభి తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.