
తిరుమల శ్రీవారి పుష్కరిణి నెలరోజుల పాటు మూత.. భక్తులు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలి
Tirumala temple pond to remain closed for a month; devotees advised to plan accordingly
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ముందు మరమ్మతుల కోసం పుష్కరిణిని జూలై 20 నుంచి ఆగస్టు 19 వరకు మూసివేస్తున్నారు. ఈ కాలంలో భక్తులకు కోనేరులో ప్రవేశం, హారతి కార్యక్రమాలకు అనుమతి ఉండదు.
In preparation for the annual Srivari Brahmotsavams, the sacred pond at Tirumala will remain closed from July 20 to August 19 for maintenance. Devotees will not be allowed into the pond or to participate in the daily Harathi rituals during this period.
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వెల్లడించిన ప్రకారం, శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో, ప్రతి సంవత్సరం వలే ఈ ఏడాదీ శ్రీవారి పుష్కరిణిలో మరమ్మత్తులు చేపట్టనున్నారు. టీటీడీ వాటర్ వర్క్స్ విభాగం ఆధ్వర్యంలో ఈ మరమ్మత్తులు జరుగనున్నాయి. దీంతో జూలై 20 నుంచి ఆగస్టు 19 వరకు కోనేరులో భక్తుల ప్రవేశం నిలిపివేయబడుతుంది. ఈ నెలరోజుల పాటు పుష్కరిణి హారతులు కూడా ఉండవని టీటీడీ పేర్కొంది. భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని, తమ యాత్రా ప్రణాళికలను సర్దుబాటు చేసుకోవాలని సూచించింది.
ఇక సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 16న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, సెప్టెంబర్ 23న అంకురార్పణ, 24న ధ్వజారోహణ జరుగుతుంది. బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వాహన సేవలు, గరుడ వాహన సేవ (సెప్టెంబర్ 28), అక్టోబర్ 1న రథోత్సవం, అక్టోబర్ 2న చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.