తిరుమల తిరుపతి దేవస్థానం పేరుతొ ఉన్న మరో నకిలీ వెబ్సైట్ పై ఎఫ్ఐఆర్ నమోదు…

  • ఎపి ఫోరెన్సిక్ సైబర్ సెల్ విచారణలోభాగంగా, నకిలీ వెబ్సైట్లను నమ్మి మోసపోవద్దని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానముల పేరుతో గల మరో నకిలీ వెబ్సైట్ ను టీటీడీ ఐటీ విభాగం గుర్తించి తిరుమల వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎఫ్ఐఆర్ 19/2023 యు/ఎస్ 420, 468, 471 ఐపిసి ప్రకారం పోలీసులు నమోదు చేసి ఎపి ఫోరెన్సిక్ సైబర్ సెల్ కు అప్పగించారు. ఈ మేరకు సైబర్ సెల్ అధికారులు నకిలీ వెబ్సైట్ పై విచారణ ప్రారంభించారు. ఇదివరకే 40 నకిలీ వెబ్సైట్లపై కేసులు నమోదు కాగా, దీంతో కలిపి కేసుల సంఖ్య 41కి చేరింది. అధికారిక వెబ్సైట్ https://tirupatibalaji.ap.gov.in/ ఇలా ఉండగా, చిన్న మార్పులతో కొందరు వ్యక్తులు రూపొందించిన https://tirupatibalaji-ap-gov.org/ వెబ్సైట్ ను టిటిడి గుర్తించింది. టీటీడీ అధికారిక వెబ్సైట్లోనే శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు, గదులు బుక్ చేసుకోవాలని కోరడమైనది. దీంతో పాటు టీటీడీ అధికారిక మొబైల్ యాప్ ను TTDevasthanams కూడా వినియోగించవచ్చుని తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *