గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు తితిదేపై విమర్శలు చేయడం తగదని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. అదనపు దర్శన టికెట్లు కావాలని తితిదేను కోరితే ఇస్తారని ఆయన పేర్కొన్నారు. బుధవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తాను విపక్షంలో ఉన్నప్పుడు కూడా తన ప్రొటోకాల్ తనకు ఇచ్చారన్నారు. అన్నా రాంబాబు అలా మాట్లాడటం వంద శాతం తప్పేనని ఆయన చెప్పారు.