తెలంగాణలో ఒలింపిక్స్ లక్ష్యంగా క్రీడాకారులకు అత్యాధునిక శిక్షణ అందించే విధంగా అంతర్జాతీయ ప్రమాణాలతో స్పోర్ట్స్ యూనివర్సిటీ నిర్మించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు
Olympics-level training infrastructure and a world-class Sports University in Telangana are being planned to strengthen the state’s sports ecosystem.

తెలంగాణలో ఒలింపిక్స్ లక్ష్యంగా క్రీడాకారులకు అత్యాధునిక శిక్షణ అందించే విధంగా అంతర్జాతీయ ప్రమాణాలతో స్పోర్ట్స్ యూనివర్సిటీ నిర్మించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. Olympics-level training infrastructure and a world-class Sports University in Telangana are being planned to strengthen the state’s sports ecosystem.
తెలంగాణలో క్రీడల అభివృద్ధిని వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. క్రీడాకారులకు ఒలింపిక్స్ స్థాయి శిక్షణ అందించేందుకు అన్ని సౌకర్యాలతో కూడిన స్పోర్ట్స్ యూనివర్సిటీ నిర్మాణంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో అంతర్జాతీయ ప్రమాణాల క్రీడా మౌలిక వసతులు ఏర్పాటు చేయడం ద్వారా భవిష్యత్ ఒలింపిక్స్, కామన్వెల్త్ క్రీడలకు తెలంగాణ ఆతిథ్యం ఇవ్వగల స్థాయికి తీసుకెళ్లాలని లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలో ప్రతిపాదించిన యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ (YISU) ప్రాజెక్టుపై సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగింది. అంతర్జాతీయ ప్రమాణాల క్రీడా మైదానాలు, శిక్షణా కేంద్రాలు, క్రీడాకారుల కోసం హాస్టల్ సదుపాయాలు, పరిశోధన మరియు శిక్షణకు అవసరమైన అన్ని సౌకర్యాలతో యూనివర్సిటీని అభివృద్ధి చేయాలని సూచించారు. నిర్మాణాలకు సంబంధించిన పలు డిజైన్లను పరిశీలించిన ముఖ్యమంత్రి అధికారులకు పలు మార్గదర్శకాలు ఇచ్చారు.
గచ్చిబౌలి ఔట్‌డోర్ స్టేడియంను పునరుద్ధరించడంతో పాటు అక్కడ ఇండోర్ స్టేడియం, యూనివర్సిటీ కాంప్లెక్స్, హాస్టల్ భవనాలు, వివిధ క్రీడల మైదానాలు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు. క్రీడాకారులు శిక్షణ పొందేందుకు అవసరమైన ఆధునిక సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
హైదరాబాద్ నగరంలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం, ఎల్బీ స్టేడియం, సరూర్‌నగర్ స్టేడియంలను కూడా భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆధునీకరించాలని నిర్ణయించారు. క్రీడాకారులకు శిక్షణ మరియు జాతీయ-అంతర్జాతీయ స్థాయి పోటీల నిర్వహణకు అనుగుణంగా ఈ స్టేడియంలను అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు.
The Telangana government is focusing on building a strong sports ecosystem by developing modern stadiums, training centres and a dedicated Sports University. Officials discussed infrastructure plans aimed at preparing athletes for international competitions such as the Olympics and Commonwealth Games.
The review meeting also discussed the revival and modernization of major stadiums in Hyderabad, including Gachibowli Stadium, Kotla Vijayabhaskar Reddy Stadium, LB Stadium and Saroor Nagar Stadium, to support training and large-scale sporting events in the future.
సమీక్షా సమావేశంలో మంత్రులు వాకిటి శ్రీహరి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ జి. కిషోర్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.