లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీం కోర్టులో షాక్ తగిలింది. ఈడీ ఇచ్చిన నోటీసులపై స్టే ఇవ్వాలని కవిత దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది. మహిళలను విచారించేదుకు ఈడీ కార్యాలయానికి పిలవటంపై కవిత సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అయితే కవిత పిటిషన్‌పై స్పందించిన సుప్రీం కోర్టు.. విచారణపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. వెంటనే విచారణ చేపట్టేందుకు కూడా నిరాకరించింది. ఈనెల 24న పిటిషన్‌పై విచారణ చేపడతామని స్పష్టం చేసింది.