. A robot dog display at the India Impact Summit 2026 in Delhi sparked controversy, leading to Galgotias University being asked to vacate the expo area.

ఢిల్లీలో జరిగిన ఇండియా ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో రోబో డాగ్ ప్రదర్శన వివాదంగా మారి గల్గోటియాస్ విశ్వవిద్యాలయం ఎక్స్‌పో ప్రాంతం ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. A robot dog display at the India Impact Summit 2026 in Delhi sparked controversy, leading to Galgotias University being asked to vacate the expo area.
ఢిల్లీలో నిర్వహించిన India Impact Summit 2026లో వివిధ వర్సిటీలు, ఏఐ నైపుణ్యాల ప్రదర్శనలు జరిగాయి. గ్రేటర్ నోయిడాలోని Galgotias University ఒక రోబో డాగ్‌ను ప్రదర్శిస్తూ దాన్ని తమ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ అభివృద్ధి చేసిన ప్రాజెక్ట్‌గా వివరించింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.
సోషల్ మీడియా యూజర్లు ఆ రోబో డాగ్ అసలు చైనా కంపెనీ తయారు చేసిన Unitree Go2 అని గుర్తించారు. విదేశీ టెక్నాలజీని స్వీయ ఆవిష్కరణగా చూపుతున్నారని విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో సమ్మిట్ నిర్వాహకులు వర్సిటీని ఎక్స్‌పో ప్రాంతం నుంచి వెళ్లిపోవాలని సూచించినట్లు సమాచారం.
వైరల్ వీడియోల్లో వర్సిటీ ప్రతినిధులు ఆ రోబో డాగ్‌ను “ఓరియన్” పేరుతో పరిచయం చేస్తూ ఫీచర్లను వివరించిన దృశ్యాలు కనిపించాయి. మరో ప్రొఫెసర్ కూడా అదే విధంగా పేర్కొన్న క్లిప్ ప్రచారం పొందింది. దీంతో వివాదం మరింత పెరిగింది.
తీవ్ర విమర్శల నేపథ్యంలో గల్గోటియాస్ విశ్వవిద్యాలయం స్పందిస్తూ ఆ రోబో డాగ్‌ను యునిట్రీ కంపెనీ నుంచే కొనుగోలు చేశామని తెలిపింది. విద్యార్థుల అభ్యాసం కోసం ఉపయోగిస్తున్నామని, తామే అభివృద్ధి చేశామని ఎక్కడా ప్రకటించలేదని స్పష్టం చేసింది.