Car Breach at Delhi Assembly

A car breach at the Delhi Assembly triggered high tension after it rammed the main gate and attempted to enter the premises during ongoing sessions; police launched a probe into ownership and motive. ఢిల్లీ అసెంబ్లీ వద్ద కారు మెయిన్ గేటును ఢీకొట్టి లోపలికి దూసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో హైటెన్షన్ నెలకొంది; వాహనం యజమాని, కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Delhi Legislative Assembly ఆవరణలో కారు కలకలం రేపింది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఒక తెల్ల కారు మెయిన్ గేటును ఢీకొట్టి బారికేడ్లను తోసుకుంటూ లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నించింది. ఈ ఘటనతో అక్కడ భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
A car attempted to force entry into the Delhi Legislative Assembly complex, ramming the main gate and breaching barricades, causing panic among security personnel. The incident occurred while Assembly proceedings were underway, prompting immediate police action.
ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ కారు ఉత్తరప్రదేశ్ రిజిస్ట్రేషన్ కలిగిన Tata Sierra గా గుర్తించారు. డ్రైవర్ అసెంబ్లీ ప్రాంగణంలోకి ప్రవేశించి స్పీకర్ కార్యాలయం బయట వరండాలో పూలగుత్తి ఉంచి, కొన్ని నిమిషాల తర్వాత గేట్ నం. 2 ద్వారా బయటకు వెళ్లిపోయినట్లు అధికారులు తెలిపారు. మొత్తం ఘటన ఐదు నిమిషాల వ్యవధిలో జరిగినట్లు సమాచారం.
Preliminary reports suggest the vehicle was a Tata Sierra bearing a Uttar Pradesh registration. The driver reportedly entered the premises, placed a bouquet outside the Speaker’s office verandah, and exited through Gate No. 2 within minutes.
కారు ఎవరిది? ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? యజమాని ఎవరు? అసెంబ్లీలోకి దూసుకెళ్లడానికి గల కారణాలు ఏమిటి? అనే అంశాలపై పోలీసులు విచారణ చేపట్టారు. ఇది ఆకతాయి చర్యా? లేక భద్రతకు ముప్పుగా ఉన్న కోణమా? అనే దానిపై అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.
Police are investigating key questions regarding the vehicle’s ownership, origin, and the intent behind the act. Authorities are probing whether it was a mischief attempt or a potential security threat.
దుండగుడు వదిలివెళ్లిన పూలగుత్తిని భద్రతా సిబ్బంది తనిఖీ చేయగా ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదని అధికారులు తెలిపారు. అయితే, గేట్‌ను ఢీకొట్టి లోపలికి ప్రవేశించిన కారు తిరిగి సులభంగా బయటకు వెళ్లడం భద్రతా లోపాలపై ఆందోళనలకు దారితీసింది.
Security personnel examined the bouquet left behind and found nothing suspicious. However, the ease with which the vehicle entered and exited the premises has raised serious concerns over security protocols.
ప్రత్యక్ష సాక్షుల ప్రకారం మధ్యాహ్నం సమయంలో భారీ శబ్దం వినిపించడంతో అందరూ అక్కడికి చేరుకుని చూసే సరికి కారు గేటును ఢీకొట్టి లోపలికి ప్రవేశించినట్లు గుర్తించారు. కొద్దిసేపటికే అదే కారు తిరిగి బయటకు వెళ్లిపోయిందని తెలిపారు.
Eyewitnesses reported hearing a loud crash around afternoon hours and saw the car break through the gate, enter briefly, and then speed away, creating panic in the area.
ఢిల్లీ పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా వాహనం, డ్రైవర్‌ను గుర్తించేందుకు సమగ్ర దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Delhi Police have initiated a detailed investigation using CCTV footage and other evidence to trace the vehicle and apprehend the driver.