డ్యాన్స్ షో ‘ఢీ’లో కొరియోగ్రాఫర్గా రాణిస్తున్న మాస్టర్ చైతన్య ఆత్మహత్య చేసుకున్నారు. నెల్లూరు క్లబ్ హోటల్లో ఇవాళ ఉరివేసుకున్నారు. తనకు అప్పులు ఎక్కువయ్యాయని, వాటిని తీర్చలేకపోతున్నానని ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియోలో తెలిపారు. చాలా ప్రయత్నించినప్పటికీ కుదరలేదని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని వెల్లడించారు.