తాడేపల్లి : బహుముఖ ప్రజ్ఞాశాలి అంబేద్కర్.. దేశం గర్వించదగ్గ మేధావి అని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం నాడు అంబేద్కర్ జయంతి సందర్భంగా అయన కు నివాళులర్పించారు.
సీఎం మాట్లాడుతూ దేశం గర్వించదగ్గ మేధావుల్లో అగ్రగణ్యుడు, మహోన్నతుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్.. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి అంటూ ప్రశంసలు కురిపించారు . న్యాయ, సామాజిక, రాజకీయ, ఆర్థిక, ఆధ్యాత్మిక, తదితర రంగాల్లో అపార జ్ఞానశీలి.. దేశ రాజకీయ, ప్రజాస్వామ్య, సాంఘిక వ్యవస్థలకు దిక్సూచి. వాటికి గట్టి పునాదులు వేసిన రాజ్యాంగ నిర్మాత అని అభివర్ణించారు.. భేదభావాలు మరిచేలా మానవత్వం పరిఢవిల్లేలా ఆయన చేసిన కృషి మరువలేం.. ఆ మహనీయుడి బాటలో నడుస్తూ పేదరిక నిర్మూలనలో, సామాజిక న్యాయ సాధికారతలో చారిత్రక అడుగులు ముందుకేశాం.. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అంటూ ట్వీట్ చేశారు.