Shoaib Akhtar’s Funny Remark on India’s Dominance in T20 World Cup 2026

టీ20 వరల్డ్ కప్ 2026లో టీమిండియా అద్భుత ప్రదర్శనపై పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ సరదా వ్యాఖ్యలు చేశాడు. భారత్ ఆటను మొహల్లాలోని అమీర్ బచ్చా–గరీబ్ బచ్చాల క్రికెట్ ఆటతో పోల్చుతూ వ్యాఖ్యానించిన అక్తర్, భారత క్రికెట్ వ్యవస్థను కూడా ప్రశంసించాడు.
టీ20 వరల్డ్ కప్ 2026లో టీమిండియా ప్రదర్శనపై పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పీటీవీ స్పోర్ట్స్‌లో ప్రసారమైన కార్యక్రమంలో మాట్లాడిన అక్తర్, భారత్ ఆటను సరదా పోలికతో వివరించాడు.
అతని వ్యాఖ్యల ప్రకారం, భారత్ ఆట మొహల్లాలో ఉండే అమీర్ బచ్చా గరీబ్ బచ్చాలను పిలిచి క్రికెట్ ఆడించినట్టుందని అన్నారు. ఆటలో చివరకు గెలవాల్సింది మాత్రం ఆ అమీర్ బచ్చానే అన్నట్లుగా భారత్ కూడా ప్రత్యర్థి జట్లపై ఆధిపత్యం చాటుతోందని నవ్వుతూ పేర్కొన్నారు.
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో జట్టు అద్భుత ప్రదర్శన కనబరిచింది. ఫైనల్లో న్యూజిలాండ్‌ను 96 పరుగుల తేడాతో ఓడించి రికార్డు స్థాయిలో మూడోసారి టీ20 వరల్డ్ కప్ టైటిల్‌ను భారత్ కైవసం చేసుకుంది.
టోర్నమెంట్ మొత్తం భారత్ బలమైన ప్రదర్శన చేసింది. సూపర్ 8 దశలో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఒక్క పరాజయం తప్ప మిగతా అన్ని మ్యాచ్‌ల్లో ప్రత్యర్థి జట్లపై పూర్తిగా ఆధిపత్యం ప్రదర్శించింది.
అక్తర్ మరో సందర్భంలో భారత క్రికెట్ వ్యవస్థను కూడా ప్రశంసించాడు. జట్టులో విస్తృతమైన టాలెంట్ పూల్ ఉండటం వల్ల కొత్త ఆటగాళ్లు నిరంతరం ఎదుగుతున్నారని అన్నారు. సంజూ శాంసన్‌ను జట్టులోకి తీసుకోవడం కోచ్ గౌతమ్ గంభీర్ మంచి నిర్ణయమని వ్యాఖ్యానించాడు.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి సీనియర్ ఆటగాళ్లు రిటైర్ అయిన తర్వాత కూడా భారత్ వరల్డ్ కప్ గెలవడం గొప్ప విషయమని పేర్కొన్నాడు. ఇది భారత క్రికెట్ వ్యవస్థ బలాన్ని చూపిస్తోందని తెలిపారు.
Former Pakistan fast bowler Shoaib Akhtar made humorous remarks on India’s outstanding performance in the ICC T20 World Cup 2026. Comparing India’s dominance to a “rich kid playing cricket with kids in the neighborhood,” Akhtar also praised the strong talent pool in Indian cricket.
Speaking on a programme aired on PTV Sports, Akhtar explained India’s performance with an interesting analogy. He said India’s approach resembles a rich kid in a neighborhood who invites other kids to play cricket but ultimately ensures he wins the game.
Under the captaincy of Suryakumar Yadav, Team India delivered an impressive performance throughout the tournament. India defeated New Zealand by 96 runs in the final to clinch the T20 World Cup title for a record third time.
India dominated most matches during the tournament. Except for a single loss against South Africa in the Super 8 stage, the team maintained strong control over the competition.
Akhtar also praised the Indian cricket system, highlighting the depth of its talent pool. He said the inclusion of Sanju Samson in the squad was a good decision by head coach Gautam Gambhir.
He added that India winning the World Cup even after the retirement of senior players like Rohit Sharma and Virat Kohli reflects the strength of the country’s cricket structure.