టీ20 ప్రపంచకప్‌-2026 సూపర్-8 దశ నేటి నుంచి ప్రారంభమవుతుండగా, కొలంబోలో పాకిస్థాన్–న్యూజిలాండ్ మధ్య కీలక మ్యాచ్‌కు వర్షం ముప్పు నెలకొంది.

T20 World Cup 2026 Super-8 stage begins today, with rain threat looming over the crucial Pakistan vs New Zealand clash in Colombo.

టీ20 ప్రపంచకప్‌-2026 సూపర్-8 దశ నేటి నుంచి ప్రారంభమవుతుండగా, కొలంబోలో పాకిస్థాన్–న్యూజిలాండ్ మధ్య కీలక మ్యాచ్‌కు వర్షం ముప్పు నెలకొంది. T20 World Cup 2026 Super-8 stage begins today, with rain threat looming over the crucial Pakistan vs New Zealand clash in Colombo.
టీ20 ప్రపంచకప్‌-2026లో సెమీస్ బెర్తులను తేల్చే సూపర్-8 మ్యాచ్‌లు శనివారం నుంచి ప్రారంభమయ్యాయి. కొలంబో వేదికగా ఇవాళ రాత్రి పాకిస్థాన్ వర్సెస్ న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. అయితే ఈ కీలక మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

వెదర్ రిపోర్టు ప్రకారం స్థానిక సమయం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5-6 గంటల మధ్య భారీ వర్షం పడే అవకాశం ఉంది. రాత్రి 7 గంటల తరువాత కూడా అక్కడక్కడ జల్లులు కురిసే సూచనలు ఉన్నాయి. రాత్రి 8 గంటల తరువాత మేఘావృత పరిస్థితులు కొనసాగవచ్చని పేర్కొన్నారు. భారీ వర్షం కురిసి మ్యాచ్ రద్దయితే, సూపర్-8 దశకు రిజర్వ్ డే లేకపోవడంతో పాకిస్థాన్‌కు తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.

న్యూజిలాండ్‌తో మ్యాచ్ రద్దయినా లేదా ఓడిపోయినా పాకిస్థాన్ సెమీస్ అవకాశాలు క్లిష్టతరమవుతాయి. పాకిస్థాన్ తన తరువాతి మ్యాచ్‌లలో ఇంగ్లాండ్, శ్రీలంక జట్లను ఎదుర్కొనాలి. ఆ మ్యాచ్‌లలో ఒకదానిలోనైనా ఓటమి లేదా వర్షం కారణంగా రద్దు జరిగితే సెమీస్ అవకాశాలు దాదాపు ముగిసే పరిస్థితి. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్‌పై విజయం పాకిస్థాన్‌కు అత్యంత అవసరమైంది.

టీ20 ఫార్మాట్‌లో ఈ రెండు జట్లు ఇప్పటివరకు 49 సార్లు తలపడ్డాయి. అందులో పాకిస్థాన్ 24 మ్యాచ్‌లలో గెలిచింది. న్యూజిలాండ్ 23 విజయాలు సాధించింది. రెండు మ్యాచ్‌లు ఫలితం లేకుండా ముగిశాయి. గ్రూప్ దశలో పాకిస్థాన్ ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయలేదు. భారత జట్టుపై ఓటమి చవిచూసిన ఆ జట్టు, నెదర్లాండ్స్‌పై కష్టపడి విజయం సాధించింది. మరోవైపు న్యూజిలాండ్ గ్రూప్ స్టేజ్‌లో స్థిరమైన ప్రదర్శన కనబర్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్థాన్ మెరుగైన ఆటతీరు కనబరచకపోతే న్యూజిలాండ్‌కు మ్యాచ్ సులభంగా మారే అవకాశముంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *