భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : చుంచుపల్లి మండలం ఆనందగని వద్ద రోడ్డు ప్రమాదం ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీకొన్నటంతో, బస్సులో ప్రయాణిస్తున్న 40 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. భద్రాచలం డిపోకు చెందిన బస్సు గుంటూరుకు వెళ్తున్న క్రమంలో ప్రమాదం సంభవించింది. క్షతగాత్రులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.