
టవీ ప్రాంతంలో నివసించే చెంచు గిరిజనులకు ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది రాష్ట్ర ప్రభుత్వం… అందులోభాగంగా గానాగర్ కర్నూలు జిల్లా నల్లమల అడవి ప్రాంతంలోని మన్ననూర్ చెంచుపెంటలో గ్రామాల్లో నివసించే 536 మంది చెంచు కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు పంపిణీ చేశారు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరావు… మొదట ఈ ప్రాంతంలో సహాచర మంత్రి జూపల్లి కృష్ణారావు తో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు మంత్రి…అనంతరం ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి మాట్లాడాడు…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా రాష్ట్రలో పేద ప్రజలకు సొంత ఇంటి కల నెరవేరుతోందని మంత్రి అన్నారు. సమాజంలో అత్యంత వెనుకబడిన చెంచులు దశాబ్దాల పాటు సొంత ఇండ్లకు నోచుకోలేదని వారి సొంతింటి కలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ఇందిరమ్మ ప్రభుత్వం సాకారం చేస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రాష్ట్ర సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్ధ (ఐటిడిఎ) లో పరిధిలోని 21 నియోజకవర్గాలలో విడతలవారీగా 13,266 చెంచు కుటుంబాలను ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నామని హామీ ఇచ్చారు. ప్రతి సోమవారం ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల చెల్లింపులు జరుగుతాయని, నేరుగా లబ్ధిదారుల ఖాతాలో విడుదల చేయనున్నట్లు మంత్రి ఈ సందర్భంగా ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ మద్దతుతో నిర్మించే ఈ ఇండ్లు సామాన్య ప్రజల ఆర్థిక భద్రతకు, గౌరవప్రదమైన జీవనానికి బలం అందిస్తున్నామన్నారు. .ఈ పథకం వల్ల పేదవారిలో భద్రతా భావం పెరుగుతుందని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం నిజంగా సామాజిక న్యాయం సాధించే దిశగా ఒక గొప్ప ముందడుగు ని తెలిపారు.