
జూరాల ప్రాజెక్టుకు భారీ వరద.. 14 గేట్లు ఎత్తివేత
మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జూరాల ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రాజెక్టు నిండిపోవడంతో అధికారులు 14 గేట్లు ఎత్తి 1.58 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం నీటిమట్టం 317.490 మీటర్ల వద్ద ఉండగా, జలవిద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది