
జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవ ఆహ్వానాన్ని కేంద్ర మంత్రి అమిత్ షాక్ కు అందజేసిన ఎంపీ అరవింద్ కోరుట్ల, తెలంగాణ రాష్ట్రం లోని నిజామాబాద్ జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించడానికి నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్, పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి తోకలసి కేంద్ర హోం అండ్ సహకార మంత్రి అమిత్ షా ని ఆహ్వానించారు. జూన్ 09 సోమవారం నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి న్యూఢిల్లీలో కేంద్ర హోం అండ్ సహకార మంత్రి అమిత్ షా ని మర్యాదపూర్వంగా కలిశారు. తెలంగాణలోని నిజామాబాద్ జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభోత్సవానికి అధికారిక ఆహ్వానాన్ని అందజేశారు.. దేశ వ్యాప్తంగా పసుపు రైతులకు చారిత్రాత్మక మైలురాయి అయిన తెలంగాణలోనే నిజామాబాద్ జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించే ఆహ్వానాన్ని కేంద్ర హోం సహకార మంత్రి అమీషా మనస్ఫూర్తిగా అంగీకరించాలని ఎంపీ అరవింద్ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి లు తెలిపారు.. ప్రారంభోత్సవ కార్యక్రమంలో అమిత్ షా జాతీయ పసుపు బోర్డు అధికారిక లోగోను కూడా ఆవిష్కరిస్తారు.. ఇది భారతదేశంలో పసుపు పండించే సమాజానికి సాధికారిక ఆవిష్కరణ ప్రపంచ మార్కెట్ యాక్సెస్ యొక్క కొత్త శతకానికి ప్రతీక అన్నారు.. నిజామాబాద్ పసుపు బోర్డు దాని ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దార్షిణిక నాయకత్వంలో రైతుల గొంతును గౌరవించడానికి దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న వాగ్దానాలను దృఢ సంకల్పంతో సమగ్రతతో నెరవేర్చడానికి భారత ప్రభుత్వం యొక్క నిబద్ధతకు నిదర్శనం అన్నారు.. ఈ కార్యక్రమం జూన్ చివరి వారంలో జరుగుతుందని, ఈ యొక్క కార్యక్రమ ఖచ్చితమైన తేదీ సమయాన్ని సకాలంలో ప్రకటిస్తామన్నారు.. ఈ ముఖ్యమైన సందర్భంగా భారతదేశ వ్యవసాయ దృశ్యంలో ముఖ్యంగా పసుపు సాగుదారులకు ఒక మలుపు తిరుగుతుంది సహకార సంఘాల స్ఫూర్తిని రైతుల నేతృత్వంలోని అభివృద్ధిని మరింత బలోపేతం చేస్తుందన్నారు.