జాతి కోసం మీడియేషన్…కృష్ణా జిల్లా జడ్జి… జి.గోపి

జాతి కోసం మీడియేషన్…
కృష్ణా జిల్లా జడ్జి… జి.గోపి

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేసులు త్వరిత గాతిన పరిష్కారం కోసం దేశవ్యాప్తంగా 90 రోజుల్లో మీడియేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కృష్ణా జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. గోపి అన్నారు. బుధవారం విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న 64 మంది మీడియేటర్లకు ఒకరోజు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా గోపి మాట్లాడుతూ మహాకవి వచనాలతో మనల్ని మనం సరిదిద్దుకోవాలని ఆలోచనల మార్పు రావాలని అన్నారు. జాతి పునర్మానం కోసం అందరూ దిద్దుబాటు వైపు ప్రయాణం చేయాలని అన్నారు. కీలకమైందని 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు పైబడిన కేసులు దేశవ్యాప్తంగా పెండింగ్ ఉన్నాయని అన్నారు. చరిత్ర చూసుకుంటే శ్రీకృష్ణుడు కూడా కౌరవులకు పాండవులకు మధ్య మధ్యవర్తిగా వ్యవహరించాలని వినకపోవడం వల్ల యుద్ధ పరిస్థితి ఏర్పడింది అని అన్నారు. జిల్లా జడ్జి పాడిన పాటలు ఎంతగానో  ఆకట్టుకున్నాయి.

ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కృష్ణాజిల్లా లీగల్ సర్వీసెస్ అధారిటీ కార్యదర్శి రామకృష్ణయ్య మాట్లాడుతూ పార్టీలకు మంచి వాతావరణం ఏర్పడడానికి మీడియేషన్ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. మానవ వాళి సంక్షేమం కోసం దేశాల మధ్య క్షేమం కోసం మీడియేషన్ ఎంతగానో ఉపయోగపడిన విషయం అందరు తెలుసుకోవాలన్నారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, జిల్లా న్యాయసేవధికార సంస్థ ఆధ్వర్యంలో కృష్ణాజిల్లాలో ఎంపిక చేసిన 11 బార్ అసోసియేషన్ లకి చెందిన 64 మంది న్యాయవాదులు, సోషల్ వర్కర్స్ ki శిక్షణ తరగతులు ఏర్పాటు చేసినట్లు రాబోయే 90 రోజులలో మీడియేషన్ ద్వారా పలు కేసులు పరిష్కారం చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో విజయవాడ రెండవ అదనపు జిల్లా జడ్జి, 3వ జిల్లా జడ్జి మచిలీపట్నం బార్ అసోసియేషన్ నుండి లంకిశెట్టి బాలాజీ, అడపా మురళి, గరిమెల్లా ప్రభాకరరావు, గంజి నాగేంద్రం, జి. శ్రీనివాస్, ఎస్. రమాదేవి, ఓ.ఎస్. కే. శివకుమార్,విజయవాడ హాజరుతయ్య గుప్తా తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *