జమ్ము కాశ్మీర్ లో జరిగిన అర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన ఆర్మీజవాన్ అంత్యక్రియల్లో పాల్గొన్నా మంత్రులు, ఎంపీ..

జమ్ము కాశ్మీర్ లో జరిగిన అర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి మండలం మల్కాపూర్ వాసి పబ్బాల అనిల్ అంత్యక్రియలు శనివారం అధికారిక లాంఛనాలతో నిర్వహించారు. మృతుడు అనిల్ ఆర్మీలో టెక్నీషియన్ గా విధులు నిర్వహిస్తున్నాడు. గత 45 రోజుల క్రితమే సెలవు పై ఇంటికి వచ్చి, పది రోజుల క్రితమే తిరిగి విధుల్లోకి చేరి ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబంతో పాటు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అనిల్ కు భార్య సౌజన్య, ఇద్దరు కుమారులు అయాన్ (6) ఆరో(3) ఉన్నారు. హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన పబ్బాల అనిల్ మృతదేహం శనివారం గ్రామానికి చేరుకుంది. అధికారిక సైనిక లాంఛనాలతో బోయినపల్లి మండలం మల్కాపూర్ గ్రామానికి ప్రజల కన్నీటి వీడ్కోలు మధ్య పలుకుతూ అంతిమయాత్ర నిర్వహించారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఎస్పీ అఖిల్ మహాజన్ లు అంత్యక్రియల్లో పాల్గొని అమర జవాను అనిల్ కు నివాళులర్పించారు. అమర జవాను అనిల్ కుటుంబాన్ని ఓదార్చారు. అనిల్ మృతితో గ్రామంలో కన్నీటి రోదనలు మిన్నంటాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *