జగనన్న శాశ్వత భూహక్కుభూరక్ష పై కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయ్యింది. సమావేశంలో పాల్గొన్న మంత్రులు పెద్దిరెడ్డి, ధర్మాన ప్రసాదరావు, బొత్స ముఖ్య సలహాదారు అజేయ్ కల్లాం అమరావతి అమరావతి సచివాలయంలోని మూడో బ్లాక్ లో గురువారం జగనన్న శాశ్వత భూహక్కు
భూరక్ష పథకం అమలుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయ్ కల్లాంతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
సమగ్ర సర్వేపై ఇప్పటి వరకు అధికారులు చేపట్టిన చర్యలపై మంత్రులు సవిూక్షించారు. పథకం అమలుపై మంత్రుల కమిటీకి అధికారులు వివరాలను తెలియచేశారు. ఈ సందర్బంగా మంత్రులు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జగనన్న భూహక్కు`భూరక్ష పథకంలో తొలి దశలో 2వేల గ్రామాల్లో మే 20వ తేదీలోగా సర్వే పూర్తి చేయాలన్న సీఎం వైయస్ జగన్ ఆదేశాల మేరకు అధికారులు పనిచేయాలని కోరారు. డ్రోన్ సర్వే, మ్యాపింగ్, గ్రౌండ్ ట్రూతింగ్, రికార్డులపై వివాదాలను పరిష్కరించే ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.
మొదటిదశలో భాగంగా 2వేల గ్రామాల్లో భూహక్కు పత్రాలను పంపిణీ చేసేందుకు చురుగ్గా ఏర్పాటు చేయాలని మంత్రులు ఆదేశించారు. ఇప్పటి వరకు 1,94,571 భూహక్కు పత్రాలను ఇప్పటి వరకు సిద్దం చేశారని, ఈకెవైసి ద్వారా ఎటువంటి వివాదాలకు తావు లేకుండా వాటిని పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు
ష్ట్రంలో గ్రావిూణ ప్రాంతాల్లో సర్వే ప్రక్రియ వేగంగా జరుగుతోందని, దానితో పాటు అర్భన్ ప్రాంతాల్లో కూడా సర్వేను చురుగ్గా నిర్వహించాలని మంత్రులు ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 123 యుఎల్బిల్లో 15 లక్షల ఎకరాలకు సర్వే చేయాల్సి ఉందని అన్నారు.
సమావేశంలో సిసిఎల్ఎ జి.సాయిప్రసాద్, అటవీ దళాల అధిపతి వై.మధుసూధన్ రెడ్డి, పిఆర్డఆర్డీ కమిషనర్ సూర్యకుమారి, సర్వే అండ్ సెటిల్ మెంట్ కమిషనర్ సిద్దార్థ్ జైన్, ఎంఎయుడి కమిషనర్ కోటేశ్వరరావు, డిఎంజి విజి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.