దంతెవాడ : ఛత్తీస్‌గఢ్ దంతెవాడ జిల్లా అరణ్‌పూర్‌లో నక్సలైట్లు ఘాతుకానికి పాల్పడ్డారు. మందుపాతర పేల్చి 10 మంది జవాన్లు, ఒక డ్రైవర్‌ను పొట్టనపెట్టుకున్నారు. మృతులంతా డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ జవాన్లు డీఆర్జీ జవాన్లు కూంబింగ్ ముగించుకుని మినీ బస్సులో వస్తుండగా నక్సలైట్లు మందుపాతర పేల్చారు. దీంతో మొత్తం 11 మంది చనిపోయారు. ఘటనా స్థలనికి పోలీస్ ఉన్నతాధికారులు చేరుకున్నారు. నక్సలైట్ల కోసం కూంబింగ్ మొదలుపెట్టారు. ఈ ఘటనపై ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బగేల్ స్పందించారు. పోలీసుల మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల్లో 10 మంది డీఆర్ఎఫ్ పోలీసులు , డ్రైవర్ ఉన్నారు. పోలీసులు కూంబింగ్‌కు వెళ్తున్న సమయంలో మావోయిస్టులు మెరుపుదాడికి దిగారు.’’ఈ ఘటన గురించి సమాచారం అందింది. ఇలా జరదటం చాలా దురదృష్టకరం. మృతుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. మావోయిస్టులపై మా యుద్ధం కొనసాగుతుంది. వాళ్లను వదిలే ప్రసక్తే లేదు’’