
Image: Screenshot from ‘ : https://www.google.com/ ” (used under fair use for reporting)
చైనా నిర్ణయాలతో అమెరికా ఆర్థికంగా కుదేలవుతోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అరుదైన ఖనిజాల ఎగుమతులపై బీజింగ్ కఠిన నిబంధనలు విధించడంతో అమెరికా గిలగిలా కొట్టుకుంటూ భారత్ సహా ఇతర దేశాల మద్దతు కోరుతోంది.
China’s move to tighten export rules on rare earth minerals has left the U.S. rattled, prompting the Trump administration to seek India’s support to collectively counter Beijing’s dominance in the global minerals trade.
చైనా తాజాగా అరుదైన ఖనిజాల (రేర్ ఎర్త్స్) ఎగుమతులపై అక్టోబర్ 9న కొత్త పరిమితులు అమలు చేసింది. ప్రపంచంలో రేర్ ఎర్త్ ఉత్పత్తిలో చైనా సుమారు 70 శాతం నియంత్రణ కలిగి ఉంది. ఈ ఖనిజాలు ఎలక్ట్రిక్ వాహనాలు, రక్షణ, ఏరోస్పేస్, హై-టెక్ పరిశ్రమలకు కీలకమైనవి. ఈ రంగాల్లో ఈ ఖనిజాల సరఫరా తగ్గితే ప్రపంచ ఉత్పత్తి చక్రం తీవ్రంగా దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
చైనా నిర్ణయంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్రస్థాయిలో స్పందించారు. చైనా ఉత్పత్తులపై 100 శాతం టారిఫ్లు విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం నవంబర్ నుండి అమల్లోకి వస్తుందని చెప్పారు. అయితే చైనా మాత్రం వెనక్కి తగ్గే సూచనలు చూపలేదు. ప్రపంచ శాంతి కోసమే అరుదైన ఖనిజాల ఎగుమతులను నియంత్రిస్తున్నామని పేర్కొంది.
అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ ఫాక్స్ న్యూస్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చైనా చర్యలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్నాయని, అరుదైన ఖనిజాలపై దాని ఆధిపత్యాన్ని అడ్డుకోవడంలో భారత్ కీలక పాత్ర పోషించగలదని అన్నారు. భారత్, యూరోపియన్ దేశాలు కలిసి అమెరికాతో సమిష్టిగా ముందుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు.
అమెరికా ప్రస్తుతం చైనా ఆధారాన్ని తగ్గించుకునే దిశగా వ్యూహాత్మక చర్యలు తీసుకుంటోంది. భారత్ విస్తృతమైన అరుదైన ఖనిజ వనరులు కలిగి ఉండటంతో అమెరికా సహకారం కోరుతోంది. అయితే, మరోవైపు భారత్ ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీసే టారిఫ్ విధించడం, చైనా వ్యతిరేక పోరులో మద్దతు అడగడం ద్వంద్వ వైఖరిగా మారిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Experts warn that China’s decision to restrict rare earth exports could disrupt key global industries. These minerals are vital for electric vehicles, defense systems, and high-tech manufacturing. In response, Donald Trump announced 100% tariffs on Chinese goods starting November, accusing Beijing of attempting to control the world economy through mineral monopolization.
U.S. Treasury Secretary Scott Besant urged India and European nations to join hands with Washington to counter China’s growing dominance. Analysts note that while India’s mineral reserves make it a strategic ally for the U.S., imposing tariffs that hurt India’s economy while seeking its cooperation exposes Washington’s policy contradictions.