A tragic road accident near Cheriyal gate claimed the life of Filmnagar SI Rajeshwar. He was returning from duty at Balkampet Yellamma temple when his car rammed into a lorry. He died while being taken to the hospital.

చెర్యాల వద్ద ఘోర రోడ్డుప్రమాదం… ఫిల్మ్‌నగర్ ఎస్సై రాజేశ్వర్ మృతి
A tragic road accident near Cheriyal gate claimed the life of Filmnagar SI Rajeshwar. He was returning from duty at Balkampet Yellamma temple when his car rammed into a lorry. He died while being taken to the hospital.
సంగారెడ్డి జిల్లా చెర్యాల గేట్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం పోలీసులు, స్థానికులను కలచివేసింది. బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో మూడు రోజులుగా బందోబస్తులో ఉన్న ఫిల్మ్‌నగర్ ఎస్సై రాజేశ్వర్, విధి ముగించుకుని తిరిగి వస్తుండగా ఆయన ప్రయాణిస్తున్న కారు లారీని ఢీకొనింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రాజేశ్వర్‌ను సహోద్యోగులు వెంటనే సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అందిస్తుండగానే ఆయన మృతి చెందారు.
రాజేశ్వర్ స్వస్థలం సంగారెడ్డిలోని చాణక్యపురి కాలనీ. ఇటీవలే వారం రోజుల క్రితం ఫిల్మ్‌నగర్ పోలీస్ స్టేషన్ ఎస్సైగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన 1990లో పోలీస్ శాఖలోకి ప్రవేశించారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. విధి నిర్వహణలోనే ప్రాణాలు కోల్పోయిన రాజేశ్వర్ మృతిపై పోలీసు శాఖలో విషాదఛాయలు అలముకున్నాయి.