బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై సవాల్ చేసినట్టుగానే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేశారు. మెడలో అమ్మవారి కండువా వేసుకుని.. “మునుగోడు ఉపఎన్నికలో కేసీఆర్ సాయం గానీ.. బీఆర్ఎస్ పార్టీ సాయం గానీ కాంగ్రెస్ పార్టీ తీసుకోలేదని భావోద్వేగానికి లోనై కళ్ల నిండా కన్నీళ్లతో రేవంత్ రెడ్డి ప్రమాణం చేశారు. భయం నా ఒంట్లో లేదు. నేను ఒక హిందువును. అమ్మవారిని నమ్ముతా.. నేను చెప్పింది అబద్దమైతే నేను సర్వనాశనం అవుతా అని అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేస్తున్నానంటూ రేవంత్ రెడ్డి ప్రమాణం చేశారు.