సంఘటనలు
*1896*: 1,500 సంవత్సరాల అనంతరం ఏథెన్స్ లో మొట్టమొదటి ఆధునిక ఒలింపిక్ క్రీడలు ప్రారంభించబడ్డాయి.
*1909*: భౌగోళిక ఉత్తర ధ్రువాన్ని మొట్టమొదటి సారిగా రాబర్ట్ పియరీ అనే అమెరికన్ సాహసయాత్రికుడు చేరుకున్నాడు.
*1930*: మహాత్మాగాంధీ నేతృత్వంలో గుజరాత్ లోని దండి వద్ద ఉప్పు చట్టం ఉల్లంఘన జరిగింది. మార్చి 12 నుండి 1930 ఏప్రిల్ 6 మధ్యకాలంలో అహ్మదాబాదు లోని తన ఆశ్రమము నుండి గుజరాత్ తీరంలోని దండీ వరకూ గల 400 కిలో మీటర్ల దూరం కాలినడకన తన యాత్ర సాగించారు. ఈ యాత్ర దండీయాత్రగా లేదా ఉప్పు సత్యాగ్రహంగా ప్రసిద్ధిగాంచింది