Natural Remedies to Reduce Gas, Acidity and Bloating

గ్యాస్, అసిడిటీ, కడుపు ఉబ్బరం సమస్యలు రోజువారీ జీవితంలో చాలా మందిని ఇబ్బంది పెడుతున్నాయి. సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం, ఒత్తిడి, మసాలా ఆహారం కారణంగా ఈ సమస్యలు పెరుగుతున్నాయి.
Gas, acidity, and bloating have become common issues affecting many people due to irregular eating habits, stress, and spicy food consumption.
ప్రస్తుతం వేగంగా మారుతున్న జీవనశైలిలో వేళాపాళా లేకుండా తినడం, జంక్ ఫుడ్ అధికంగా తీసుకోవడం వల్ల జీర్ణక్రియపై ప్రతికూల ప్రభావం పడుతోంది. దీని కారణంగా కడుపులో గ్యాస్ పేరుకుపోవడం, ఉబ్బరం, అసిడిటీ వంటి సమస్యలు తలెత్తుతున్నాయి.
In today’s fast-paced lifestyle, irregular eating patterns and increased intake of junk food are negatively impacting digestion, leading to gas formation, bloating, and acidity.
వైద్య నిపుణుల సూచనల ప్రకారం, కొన్ని సహజ పద్ధతులను పాటించడం ద్వారా ఈ సమస్యలను తగ్గించుకోవచ్చు. గోరువెచ్చని నీరు త్రాగడం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఉదయం నిద్రలేవగానే గోరువెచ్చని నీరు తీసుకోవడం వల్ల జీవక్రియ చురుకుగా మారుతుంది.
According to medical experts, following simple natural remedies can help manage these issues. Drinking warm water improves digestion, especially when consumed in the morning.
జీలకర్ర నీరు (జీరా వాటర్) గ్యాస్, ఉబ్బరాన్ని తగ్గించడంలో ఉపయోగకరంగా ఉంటుంది. ఒక స్పూన్ జీలకర్రను నీటిలో మరిగించి త్రాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
Cumin water (jeera water) is effective in reducing gas and bloating. Boiling cumin seeds in water and consuming it aids digestion.
అల్లం కూడా జీర్ణ సమస్యలకు మంచి పరిష్కారం. భోజనం తర్వాత చిన్న అల్లం ముక్క నమలడం లేదా అల్లం టీ త్రాగడం వల్ల కడుపు నొప్పి, ఉబ్బరం తగ్గుతుంది.
Ginger is another effective remedy. Chewing a small piece after meals or drinking ginger tea helps reduce stomach discomfort and bloating.
వాము (అజ్వైన్) గ్యాస్ సమస్యలకు తక్షణ ఉపశమనం ఇస్తుంది. వామును ఉప్పుతో కలిపి గోరువెచ్చటి నీటితో తీసుకుంటే అజీర్తి తగ్గుతుంది.
Ajwain (carom seeds) provides quick relief from gas. Consuming it with salt and warm water helps reduce indigestion.
మజ్జిగలో ఉండే మంచి బ్యాక్టీరియా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. వేయించిన జీలకర్ర పొడి కలిపిన మజ్జిగ తీసుకోవడం వల్ల ఎసిడిటీ తగ్గుతుంది.
Buttermilk contains beneficial bacteria that improve digestion. Adding roasted cumin powder enhances its effectiveness against acidity.
పుదీనా ఆకులు కడుపును ప్రశాంతంగా ఉంచుతాయి. అలాగే అరటిపండు సహజ యాంటాసిడ్‌లా పనిచేసి కడుపులో యాసిడ్ స్థాయిలను తగ్గిస్తుంది.
Mint leaves help soothe the stomach, while bananas act as natural antacids and reduce acid levels.
అదనంగా, మసాలా, నూనె ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తగ్గించడం, ఒకేసారి ఎక్కువగా తినకుండా చిన్న చిన్న మోతాదుల్లో తీసుకోవడం, భోజనం తర్వాత కొద్దిసేపు నడవడం వంటి అలవాట్లు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.
Additionally, reducing oily and spicy foods, eating smaller portions, and walking after meals can significantly improve digestion.