గంజాయి అమ్మెందుకు యత్నించిన నిందితులను అదుపులో తీసుకున్న శామీర్పేట్ పోలీసులు…

ఈ నెల 19న సాయంత్రం 04:30 గంటల ప్రాంతం లో చంద్ర శేఖర్ SI తన సిబ్బంది తో కలిసి శామీర్ పేట్ ఏరియా లో పెట్రోల్లిoగ్ చేస్తుండగా, నల్సార్ ‘X’ రోడ్డు దగ్గరలో, ఇద్దరు వ్యక్తులు ఒక బ్యాగ్ వేసుకొని అనుమానాస్పదంగా వెళ్తుండటం, అంతే కాకుండా పోలీసులను చూసి భయపడి పక్కకు వెళ్తుండగా, అనుమానం వచ్చి వారిద్దరినీ పట్టుకొని విచారించగ వారి పేర్లు హరీష్ పరోధి, వయస్సు 22 సం లు మరియు పలాష్ సంజయ్ సాల్వే, వయస్సు 23 సం లు మరియు వారు చంద్రపూర్, మహారాష్ట్ర కు చెందిన వారని తెలిపినట్లుగా శామీర్పేట్ సీఐ సుహాదీర్ కుమార్ తెలిపారు. అయితే వారి బ్యాగ్ ని తనిఖీ చేయగా అందులో సుమారు 2.8 Kg ల గంజాయి లభించిందన్నారు. అయితే వారు హైదరాబాద్ లో ని ఒక ప్రైవేట్ కంపెనీ లో పనిచేస్తున్నారని, వారికి వచ్చే జీతం అవసరాలకు సరిపోకపోవడంతో, చంద్రపూర్ లో గుర్తు తెలియని వ్యక్తుల దగ్గర మొదట్లో కొంచెం కొంచెం కొనుక్కొని దాన్ని మాధాపూర్ ఏరియా చుట్టూపక్కల ప్రాంతాలలో మరియు హైదరాబాద్ శివారు శామీర్ పేట్ ఏరియా లో అమ్ముతున్నారని, ఇదే క్రమం లో వారు చంద్రపూర్ లో గుర్తు తెలియని వ్యక్తుల దగ్గర 2.8 Kg గంజాయిని కొని, దాన్ని శామీర్ పేట్ ప్రాంతంలో అమ్మడం కోసం శామీర్ పేట్ కి వచ్చినట్లు నిందితులు తెలిపారన్నారు. ఇట్టి విషయం లో శామీర్ పేట్ పోలీసు వారు కేసు నమోదు చేసి నేరస్థుల దగ్గర నుండి 2.8 Kg గంజాయి, రెండు సెల్ ఫోన్లను సీజ్ చేసి, వారిని రిమాండ్ కి తరలించడం జరిగిoది శామీర్పేట్ సీఐ సుధీర్ కుమార్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *