హైదరాబాద్ : మణిపూర్ నుండి ప్రత్యేక విమానంలో వచ్చిన తెలంగాణా, ఆంద్ర ప్రదేశ్ లకు చెందిన దాదాపు 72 మంది విద్యార్థినీ, విద్యార్థులకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సి.హెచ్. మల్లా రెడ్డి, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, అడిషనల్ డీజీ లు మహేష్ భగవత్, అభిలాష బిస్త్, డీఐజీ బి. సుమతి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీష్, ప్రోటోకాల్ డైరెక్టర్ అర్విందర్ సింగ్ తదితర అధికారులు స్వాగతం పలికారు. తమను మణిపూర్ నుండి సురక్షితంగా రప్పించిన తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు వారు కృతజ్ఞతలను తెలిపారు