క్యాబ్ బుక్ చేసుకొని మరీ, క్యాబ్ డ్రైవర్ పై కత్తితో దాడి చేసి కారుతో పరార్..


రంగారెడ్డి : ఎల్బీనగర్‌ టు శంషాబాద్‌ ఎయిర్‌ పోర్ట్‌ వరకు యూబర్‌ లో కారు బుక్‌ చేసుకున్న ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఎయిర్పోర్ట్‌ రోడ్డులో క్యాబ్‌ డ్రైవర్ను కత్తితో దాడి చేసి క్యాబ్తో పరారయిన ఘటన గురువారం తెల్లవారుజామున పహాడిషరీఫ్‌ పోలీస్స్టేషన్‌ పరిధిలో తీవ్ర కలకలం రేపుతుంది. పహాడిషరీఫ్‌ పోలీసులు, బాధితుని వివరాల ప్రకారం … కంచన్బాగ్‌, హఫీజ్బాబానగర్‌ కు చెందిన విూర్జా ఆజంబేగ్‌ (21) వృత్తి రిత్యా క్యాబ్‌ డ్రైవర్‌. యూబర్‌ క్యాబ్‌ సర్వీస్లో డ్రైవర్‌. గురువారం తెల్లవారు జామున 12.45 గంటలకు యూబర్‌ యాప్లో వచ్చిన మెసేజ్ప్రకారం టిఎస్‌ 09 యు.డి 4323 నెంబర్‌ గల మారుతి కారులో విూర్జా ఆజంబేగ్‌ ఇద్దరు వ్యక్తులను ఎల్బీనగర్‌ వద్ద పికప్‌ చేసుకున్నాడు. శంషాబాద్‌ ఎయిర్పోర్ట్‌ లో డ్రాప్‌ చేయాల్సి ఉండగా ముందుగా ఓటీపీ చెప్పమని క్యాబ్‌ డ్రైవర్‌ అడిగాడు. ఫోన్‌ ప్రాబ్లమ్‌ ఉందని, మార్గ మధ్యలో చెబుతానని చెప్పడంతో పహాడిషరీఫ్‌ పోలీస్స్టేషన్‌ దాటగానే ఓ వ్యక్తి వాష్‌ రామ్‌ అంటూ కారు ఆపాలని చెప్పడంతో తాను ఎయిర్‌ పోర్ట్‌ దగ్గర లోనే ఉందని అక్కడ అపుతానని చెప్పాడు. దీంతో వెనుక సీటులో కూర్చున్న ఓ వ్యక్తి వెనుక నుంచి గట్టిగా పట్టుకోగా, నా పక్కన సీటులో కూర్చున్న వ్యక్తి కత్తితో క్యాబ్‌ డ్రైవర్పై దాడిచేశాడు. క్యాబ్‌ డ్రైవర్‌ తలకు బలమయిన గాయాలు అవ్వడంతో వెంటనే కారు ఆపి కిందకు దిగాడు. సదరు వ్యక్తులు క్యాబ్తో పరారయ్యారు. క్యాబ్‌ డ్రైవర్‌ మరొక కారు లిఫ్ట్‌ తీసుకుని మరీ వెంబండిరచిన ఫలితం లేకుండా పోయింది. జరిగిన విషయాన్ని తన కారు యజమాని అజ్మత్కు వివరించాడు. వెంటనే యజమాని జీపీఎస్‌ యాప్‌ ద్వారా చెక్‌ చేయగా క్యాబ్‌ బేగంబజార్లో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే క్యాబ్‌ డ్రైవర్‌ విూర్జా ఆజంబేగ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పహాడిషరీఫ్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తీవ్రంగా గాయపడిన క్యాబ్‌ డ్రైవర్ను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
RRRRRRRRRRRRRRRRRRRRచీచీఅఅ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *