
కోర్ట్’ హీరోయిన్ శ్రీదేవితో కేజేఆర్ కొత్త సినిమా ప్రారంభం
KJR’s second film launched, Sridevi of ‘Court’ fame to play the lead
చెన్నై: స్పోర్ట్స్ కోర్ట్ డ్రామా ‘గుర్తింపు’తో తెలుగు, తమిళ భాషల్లో హీరోగా పరిచయమైన కేజేఆర్ ఇప్పుడు తన రెండో చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు సోమవారం ఉదయం చెన్నైలో జరగాయి. ‘మార్క్ ఆంటోనీ’ వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన మినీ స్టూడియోస్ ఈ సినిమాను ప్రొడక్షన్ నెం.15గా రూపొందిస్తోంది. తెలుగులో గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ విడుదల చేయనుంది.
ఈ సినిమాతో ప్రశాంత్ పాండ్య రాజన్ శిష్యుడు రెగన్ స్టానిస్లాస్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభమయ్యే ఈ చిత్రంలో ‘కోర్ట్’ సినిమాతో పేరు తెచ్చుకున్న శ్రీదేవి కథానాయికగా నటించనున్నారు.
తారాగణంలో అర్జున్ అశోకన్, సింగంపులి, జయప్రకాష్, హరీష్ కుమార్, పృద్విరాజ్, ఇందుమతి, అశ్విని కె. కుమార్, అభిషేక్ జోసెఫ్ జార్జ్, అజు వర్గీస్, శ్రీకాంత్ మురళి కీలక పాత్రలు పోషించనున్నారు.
ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతం అందించగా, పి.వి. శంకర్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహించనున్నారు. ఎస్. వినోద్ కుమార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.