
కోతచెరువులో మెగా పీటీఎం 2.0లో పాల్గొన్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్
CM Chandrababu and Minister Lokesh attend Mega PTM 2.0 at Kothacheruvu
శ్రీసత్యసాయి జిల్లాలోని కొత్తచెరువు జడ్పీ హైస్కూల్ వేదికగా మెగా పీటీఎం 2.0లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. విద్యార్థులు, తల్లులతో ప్రత్యక్షంగా మాట్లాడారు.
Chief Minister Chandrababu Naidu and Minister Nara Lokesh attended the Mega PTM 2.0 program held at Kothacheruvu ZP High School in Sri Sathya Sai district. They interacted directly with students and mothers.
తెలుగు వార్తా కథనం:
శ్రీసత్యసాయి జిల్లా కొత్తచెరువు మండలంలోని జడ్పీ హైస్కూల్ లో నిర్వహించిన మెగా పీటీఎం 2.0 కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. కార్యక్రమంలో తల్లికి వందనం పథకం ద్వారా లబ్ధిపొందిన తల్లులు, పాఠశాల విద్యార్థులతో వారు ముఖాముఖిగా చర్చించారు.
ఈ సందర్భంగా సీఎం విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డులను పరిశీలించారు. తల్లిదండ్రులకు, విద్యార్థులకు విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచనలు చేశారు. పాఠశాల తరగతి గదుల్లో డిజిటల్ విద్యను ఎలా అందిస్తున్నారు అనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం డిజిటల్ తరగతి గదిలో విద్యార్థులతో ప్రత్యక్షంగా మాట్లాడారు.
విద్యార్థులకు సహజ వనరులు, పునరుద్పాదక వనరులపై ముఖ్యమంత్రి క్లాస్ తీసుకున్నారు. విద్యారంగాన్ని మరింత పటిష్టంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు. మెగా పీటీఎం ద్వారా తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు మధ్య నేరుగా సంబంధం ఏర్పడుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
English News:
Chief Minister N. Chandrababu Naidu and Minister Nara Lokesh participated in the Mega PTM 2.0 event held at ZP High School in Kothacheruvu, Sri Sathya Sai district. The event focused on direct interaction with beneficiaries of the “Thalliki Vandhanam” scheme, along with school students and their parents.
During the event, the Chief Minister reviewed the progress cards of the students and offered several academic suggestions to both students and their parents. He engaged with students inside the digital classroom and inquired about the use of technology in teaching.
Chandrababu Naidu also delivered a short class on natural and renewable resources, encouraging students to stay informed and responsible. He emphasized that the state government is committed to strengthening the education sector and making parent-teacher interaction more meaningful through such Mega PTMs.