రేపటి నుంచి సమీకృత కొత్త సచివాలయానికి శాఖల ఫర్నిచర్, ఫైల్స్ తరలింపు ప్రారంభంకానుంది. ఈ నెల 28 వ తేదీ వరకు షిఫ్టింగ్ కొనసాగింపు. ఒక్కో ఫ్లోర్ కు మూడు శాఖల కేటాయించారు. గ్రౌండ్ ఫ్లోర్లో రెవెన్యూశాఖ, మొదటి ఫ్లోర్లో హోమ్ శాఖ, రెండో అంతస్తులో ఆర్థిక శాఖ, మూడో ఫ్లోర్లో అగ్రికల్చర్ & ఎస్సి డెవలప్మెంటుకు కేటాయించగా, నాలుగవ అంతస్తులో ఇరిగేషన్ అండ్ లా, ఐదవ అంతస్తులో సాధారణ పరిపాలన శాఖ, ఆరో ఫ్లోర్ లో సీఎం, సీఎస్ లకు కేటాయించారు. శాఖల వారిగా ఉత్తర్వులు జారీ. 30 వ తేదీన సమీకృత కొత్త సచివాలయాన్ని ప్రారంభించనున్న సీఎం కేసీఆర్. అదేరోజు ఉదయం కొత్త సచివాలయం ప్రాంగణంలో సుదర్శన యాగం. ఏర్పాట్లు చేస్తున్న అధికారులు. సీఎస్ నేతృత్వంలో ఇవాళ కో ఆర్డినేషన్ మీటింగ్. ప్రారంభోత్సవం కోసం శాఖల వారిగా బాధ్యతల అప్పగించనున్నారు.