హైదరాబాద్ : తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త సంవత్సరంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు. శుక్రవారం సికింద్రాబాద్, బోయిన్‌పల్లిలో రాజీవ్ గాంధీ యూత్ ఆన్‌లైన్ క్విజ్ కాంపిటిటేషన్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విూడియాతో మాట్లాడుతూ దేశానికి టెక్నాలజీ ని అందించింది రాజీవ్ గాంధీయేనన్నారు. తెలంగాణ యువతలో మేధో సంపత్తిని బయటికి తెచ్చేందుకు క్విజ్ ఏర్పాటు చేశారని, పేద కుటుంబం నుంచి వచ్చి ఆస్కార్ అందుకున్న రాహుల్ సిప్లిగంజ్‌ను ప్రభుత్వం గ్రహించకుండా చిన్న చూపు చూసి ఎటువంటి స్వాగతం పలకలేదని విమర్శించారు.
టీవీలో ఆస్కార్ అవార్డులు చూడటం తప్ప, ఆస్కార్ అవార్డ్ అందుకున్న వారు తెలుగులో లేరని రేవంత్ అన్నారు. ఆస్కార్ అవార్డ్ అందుకున్న రాహుల్ సిప్లిగంజ్ కు కాంగ్రెస్ తరపున రేవంత్ రూ. 10 లక్షల నజరానా ప్రకటించారు. క్విజ్‌లో బహుమతులు గెలుపొందిన వారికి ప్రియాంక గాంధీ చేతుల విూదుగా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రేవంత్‌తోపాటు రాష్ట్ర ఇంచార్జి మనిక్‌రావు ఠాక్రే, ఆస్కార్ అవార్డ్ గ్రహీత రాహుల్ సిప్లిగంజ్ తదితరులు పాల్గొన్నారు.