సెప్టెంబర్ 18 నుంచి 22 వరకూ ఐదు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు పిలుపునిచ్చింది కేంద్ర ప్రభుత్వం. పలు కీలక బిల్లులు ప్రవేశపెట్టేందుకే ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో పాటు ఒకే దేశం, ఒకే ఎన్నిక పైనా చర్చ జరిగే అవకాశాలున్నాయి. ఇప్పటికే దీనిపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఓ కమిటీ ఏర్పాటైంది. అయితే…ఈ ప్రత్యేక సమావేశాలు పాత పార్లమెంట్ బిల్డింగ్‌లో జరుగుతాయా..? లేదంటో కొత్త భవనంలో నిర్వహిస్తారా అన్న అనుమానాలు తలెత్తాయి. ఈ విషయంలో కేంద్రం క్లారిటీ ఇచ్చింది. సెప్టెంబర్ 18న అంటే…తొలి రోజు సమావేశాలు పాత బిల్డింగ్‌లోనే జరుగుతాయని స్పష్టం చేసింది. ఆ తరవాత సెప్టెంబర్ 19న వినాయక చవితి సందర్భంగా కొత్త బిల్డింగ్‌లోకి షిఫ్ట్ అవుతున్నట్టు వెల్లడిరచింది. అంటే…సెప్టెంబర్ 19`23 వరకూ కొత్త పార్లమెంట్ భవనంలోనే ప్రత్యేక సమావేశాలు జరుగుతాయి. ఈ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్‌ని ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. అయితే…ఇప్పటి వరకూ ఈ సమావేశాల అజెండా ఏంటన్నది స్పష్టంగా చెప్పలేదు కేంద్ర ప్రభుత్వం. ఈ విషయమై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషిని ప్రశ్నించగా…త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. జూన్1వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ చేతుల విూదుగా కొత్త పార్లమెంట్ బిల్డింగ్‌ని ప్రారంభించారు. మోదీతో పాటు లోక్‌సభ స్పీకర్ ఓమ్ బిర్లా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇందులోనే సెన్గోల్ని ఏర్పాటు చేశారు. ప్రశ్నోత్తరాల సమయం, ప్రైవేట్ కార్యకలాపాలు ఉండవని లోక్‌సభ, రాజ్యసభ సెక్రటేరియట్ల నుంచి ఇటీవలే అధికారిక నోటిఫికేషన్ వెలువడిరది. సెషన్లో ఐదు సిట్టింగ్‌లు ఉంటాయి. సభ్యులు విడిగా తాత్కాలిక క్యాలెండర్‌ని అందుకుంటారు. సెప్టెంబర్ 18 నుంచి 17వ లోక్‌సభ పదమూడో సమావేశాలు ప్రారంభమవుతాయని సూచిస్తూ లోక్‌సభ సెక్రటేరియట్ బులెటిన్ విడుదల చేసింది. సెప్టెంబర్ 18న సమావేశాలు ప్రారంభమవుతాయని, ఈ మేరకు సభ్యులకు సమాచారం ఇస్తున్నట్లు బులిటెన్‌లో పేర్కొంది. జమిలీ ఎన్నికలపై చర్చ జరుగుతున్న సమయంలో ఈ సమావేశాలపై ప్రకటన రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాజ్యసభ రెండు వందల అరవై ఒకటో సెషన్ సెప్టెంబర్ 18వ తేదీన ప్రారంభమవుతుందని, ఈ మేరకు సభ్యులకు తెలియజేస్తున్నట్లు రాజ్యసభ సెక్రటేరియట్ తెలిపింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి సెప్టెంబర్ 18 నుంచి ఐదు రోజుల పాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. అయితే సమావేశాల అజెండాను రహస్యంగా ఉంచారు. దీంతో పలు ఊహాగానాలు వస్తున్నాయి.మరో వైపు దేశం పేరును ఇండియా నుంచి భారత్ గా మార్చుతారనే ప్రచారం వేళ ఇండియా కూటమి నేతలు అత్యవసరంగా సమావేశమైంది.. సెప్టెంబర్ 18వ తేదీ నుంచి మొదలయ్యే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల అజెండా ఏంటి అని అడగటంతో పాటు వివిధ సమస్యలపై చర్చించాలని డిమాండ్ చేస్తూ లేఖ రాయనున్నట్లు తెలుస్తోంది. 24 పార్టీల ప్రతిపక్ష కూటమి ఇండియా తరఫున మరికొన్ని రోజుల్లో లేఖ రాస్తారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. దేశం పేరు మార్చనున్నారన్న వేళ ఇండియా కూటమి అత్యవసరంగా సమావేశమైంది. కాంగ్రెస్ పార్లమెంటరీ లీడర్లు సోనియా గాంధీ నివాసంలో సమావేశం అయ్యారు. అనంతరం ఏఐసీసీ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే నివాసంలో ఇండియా కూటమికి చెందిన నేతలు భేటీ అయ్యారు. ఇండియా అనే పేరును రాజ్యాంగం నుంచి తొలగించడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు కూటమి నేతలు మూకుమ్మడిగా చెప్పినట్లు సమాచారం. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు ఐదు రోజుల పాటు జరగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను బహిష్కరించాలని కొన్ని చిన్న పార్టీలు సూచించగా అయితే పెద్ద పార్టీలు మాత్రే ఆ సూచనలను తిరస్కరించినట్లు తెలుస్తోంది. సానుకూల అజెండాతో ప్రత్యేక సమావేశాలకు రావాలని నిర్ణయించుకున్నట్లు ఓ పార్టీ నాయకుడు తెలిపారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను ఎందుకు పెడుతున్నారో కేంద్రం నుంచి ఎలాంటి స్పష్టత లేదని, ఈ ప్రత్యేక సెషన్ ప్రత్యేకత ఏమిటో దేశానికి తెలియదని, బీజేపీ అజెండా ఏమిటో దేశానికి చెప్పాలని కూటమి నాయకుడు ఒకరు డిమాండ్ చేశారు. అయితే ఈ ప్రత్యేక సమావేశాల్లో కూటమి పక్షాలు ఏకాభిప్రాయంతో చర్చించేలా మల్లిఖార్జున్ ఖర్గే కొన్ని అంశాలను ప్రకటించారు. అదానీ గ్రూప్ పై తాజా ఆరోపణలు, ధరల పెరుగుదల, నిరుద్యోగం, మణిపూర్ లో హింసాత్మక పరిస్థితి, కాగ్ రిపోర్టు, అధిక కనీస మద్దతు ధర డిమాండ్, ఫెడరల్ ఏజెన్సీల దుర్వినియోగంపై చర్చించాలని కేంద్రాన్ని డిమాండ్ చేయాలనని 28 పార్టీల నాయకులు నిర్ణయించినట్లు సమాచారం. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల కోసం ‘ఇండియా’ కూటమిగా ఏర్పడ్డ విపక్షాలకు మోకాలడ్డిన చందంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు. ఢల్లీి ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ స్పందిస్తూ.. ‘ఇండియా’ కూటమి పేరు సమస్యగా ఉన్నందున ‘భారత్’గా మార్చుకుంటే, మరి ‘భారత్’ స్థానంలో భారతీయ జనతా పార్టీ మరేదైనా పేరు పెట్టుకుంటుందా? అని ప్రశ్నించారు.దేశం 140 కోట్ల మంది ప్రజలది, కేవలం ఒక పార్టీది కాదు అంటూ మండిపడ్డారు. అలాగే ఇంకా ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేశారు. ఒక వేళ విపక్ష కూటమి పేరును ఇండియా నుంచి భారత్ అని మార్చితే అప్పుడు ఏం చేస్తారంటూ ప్రశ్నించారు. తాము కూటమి పేరును భారత్‌గా మారిస్తే విూరు దేశం పేరును బీజేపీగా మారుస్తారా అంటూ అడిగారు.