
కొత్తపల్లి-హుస్నాబాద్ రహదారి పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశాలు
Collector Pamela Satpathy reviews and directs to speed up Kottapalli–Husnabad four-lane works
కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, కొత్తపల్లి–హుస్నాబాద్ నాలుగు వరుసల రహదారి నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే మార్కింగ్ పూర్తయినందున ఎలక్ట్రికల్ వర్క్స్, బావుల పూడ్చివేత, చెట్ల తొలగింపు వంటి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. గ్రామాల గుండా వెళ్ళే రహదారి నిర్మాణానికి గ్రామసభలు నిర్వహించి తీర్మానాలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.
Karimnagar District Collector Pamela Satpathy reviewed the progress of the Kottapalli–Husnabad four-lane road project and directed officials to speed up the works. She emphasized that since marking is already completed, tasks like electrical line shifting, filling up of wells, and tree cutting must be carried out swiftly. She also instructed that Gram Sabhas should be held in villages where the road passes to take necessary resolutions for smooth execution.
హుస్నాబాద్ నుండి కొత్తపల్లి వరకు నిర్మించనున్న రోడ్డులో, కరీంనగర్ జిల్లా పరిధిలోని గుండ్లపల్లి, గునుకుల కొండాపూర్, జంగపల్లి గ్రామాల్లో రహదారి పక్కన ఉన్న బావులను పూడ్చివేయాలని కలెక్టర్ ఆదేశించారు. అడ్డుగా ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించి కొత్త లైన్ ఏర్పాటుకు చర్యలు వేగవంతం చేయాలని సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీ కిరణ్, జిల్లా అటవీ అధికారి బాలామణి, ఆర్ అండ్ బి ఈఈ నరసింహచారి తదితర అధికారులు పాల్గొన్నారు.
For the Kottapalli–Husnabad four-lane road, the Collector instructed that wells along the roadside in Gundlapalli, Gunukula Kondapur, and Jangapalli villages under Karimnagar district limits should be filled. She also directed that obstructing electric poles be removed and new lines set up at the earliest. Additional Collectors Ashwini Tanaji Wakade, Lakshmi Kiran, District Forest Officer Balamani, R&B EE Narasimhachari, and other officials attended the review meeting.